చంద్రన్న సంక్రాంతి కానుకలో  అవినీతి

2 Jan, 2018 20:16 IST|Sakshi

సాక్షి, అమరావతి:   ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్రాంతి కానుకగా ఇస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి బయటపడింది. కానుకల పేరుతో రేషన్‌ కార్డుదారులకు రేషన్‌ డీలర్లు నాశిరకం, నీరుగారిన బెల్లం  పంపిణీ చేస్తున్నారు. కిలో రూ. 48 చొప్పున 70 లక్షల కిలోల బెల్లాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏపీలో కిలో బెల్లం రూ.37కు దొరుకుతున్న రేషన్‌ షాపుల్లో కిలో రూ. 48  చెల్లించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ ధర చెల్లించినా నాశిరకపు వస్తువు పంపిణీ చేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండి నెయ్యి కూడా దుర్వాసన వస్తుందని వినియోగదారులు మండిపడుతున్నారు. అదేవిదంగా కురుపాం మండలం శివన్నపేటలో చంద్రన్న కానుకల్లో పంపిణీ చేసిన బెల్లం లో పురుగులు.. నీరుగారిన బెల్లం... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు.

మరిన్ని వార్తలు