కోర్టు విధులకు ఆటంకం కలిగించొద్దు

18 Aug, 2013 04:49 IST|Sakshi

విశాఖపట్నం-లీగల్, న్యూస్‌లైన్: న్యాయస్థానాలు కూడా అత్యవసర సేవలందించేవేనని, ఏ సమస్యపై ఆందోళనలు చేసినా సరే కోర్టు విధులకు ఆటంకం కలిగించవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలోని జిల్లా కోర్టు న్యాయవాదుల గ్రంథాలయంలో శనివారం  జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, కోర్టుల తీర్పులు వెలువరించే ప్రక్రియలో జాప్యం మంచిది కాదన్నారు. త్వరలోనే సంచార లోక్ అదాలత్‌లు పనిచేస్తాయని చెప్పారు. తీర్పుల జాప్యం వల్ల పౌరులకు న్యాయప్రక్రియపై నమ్మకం సన్నగిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా  శనివారం సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు, ఈవో  కె.రామచంద్రమోహన్ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ సేన్‌గుప్తా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా చుట్టూ ప్రదక్షిణ చేశారు.

మరిన్ని వార్తలు