మరింత జోరెక్కిన సమైక్య పోరు | Sakshi
Sakshi News home page

మరింత జోరెక్కిన సమైక్య పోరు

Published Sun, Aug 18 2013 4:45 AM

united andhra movement support increases

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరు మరింత పెరి గింది. ఉద్యమకారులు శనివారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నా రు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం రోడ్లపై క్రీడాకారులతో కలిసి ఆటలాడారు. శ్రీకాకుళంలో క్రీడాకారులు, వివిధ క్రీడాసంఘాల ప్రతినిదులు క్రీడా పరికరాలు, క్రీడాజ్యోతితో ప్రధాన వీధుల్లో ర్యాలీ చేశారు. డే అండ్ నైట్, వైఎస్‌ఆర్ కూడళ్లలో మానవహారం చేపట్టారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ క్రీడాకారులతో కలిసి రోడ్డుపై ఆటలు ఆడి ఉద్యమకారుల్లో నూతనోత్తేజం నింపారు.
 
 పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అధ్యాపకులు రోడ్డుపై పాఠాలు బోధించారు. స్టేషనరీ అండ్ ప్రింటర్స్ అసోషియేష న్ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహిచారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు. అక్కడకు వచ్చినవారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆటో రిక్షా యూనియన్ సభ్యులు వందలాది ఆటోలతో ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డే అండ్ నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి జంక్షన్, పాత బస్టాండ్ మీదుగా వైఎస్‌ఆర్ కూడలికి చేరుకుని అక్కడ ఆటోలతో హరం నిర్వహించారు. ఆదిత్య పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది భ్యారీ ర్యాలీ నిర్వహిం చారు. గురజాడ విద్యాసంస్థల విద్యార్థులు బైక్ ర్యాలీ చేశారు. రెవెన్యూ, జిల్లా పరిషత్, పురపాలక సంఘం, విద్యుత్ శాఖల ఉద్యోగులు, వైద్యఆరోగ్య శాఖ మినిస్టీరియల్ సిబ్బంది, న్యాయవాదుల, ఆర్టీసీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు.
 
     పాలకొండలో ప్రైవేట్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ సంఘం సభ్యులు ర్యాలీ చేశారు. ఏలాం కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. డిగ్రీ కళాశాల అధ్యాపకు లు, విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీ చేసి పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యాంధ్ర కలిగే లాభాలు, రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాల గురించి అధ్యాపకులు రహదారిపైనే విద్యార్థులకు అవగాహన కల్పిం చారు. పీఆర్‌టీయూ సభ్యులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నా రు.  సీతంపేట మండలం చినబగ్గలో ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించి ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్నారు. వీరఘట్టం మండలం నడుకూరులో విద్యార్థులు నిరసన కార్యక మం నిర్వహించారు. చలివేంద్రి గ్రామస్తులు రోడ్డుపై వంటావార్పు చేశారు.  నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో మహిళలు పాల్గొన్నారు. ఉర్లాంలో హైస్కూల్ విద్యార్థులు రోడ్డుపై వంటావార్పు చేసి భోజనాలు చేశారు.
 
 ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పోలాకి మం డలం ప్రియాగ్రహారం, తలసముద్రం గ్రామాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జలుమూరు మండలం జలుమూరు, హుస్సేనుపురాల్లో ర్యాలీలు జరిపి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సారవకోట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఆకారంలో నిల్చొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.  ఆమదాలవలస నియోజకవర్గంలో శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బస్సు యాత్ర సాగింది. ఆమదాలవలసలో పౌరసరఫరాల డిపోల డీలర్లు ర్యాలీ నిర్వహిం చారు. రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోలు, తలయారీలు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పాలపోలమ్మ మత్సకార సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సోని యా, కేసీఆర్‌లను దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద యువకులు వంటావార్పు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు విధుల ను బహిష్కరించారు. జ్యుడీషియల్ ఉద్యోగులు భోజన విరా మ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు, బూర్జలో టైలర్లు రోడ్డుపై కుట్టుమిషన్లు పెట్టి నిరసన తెలిపా రు. పొందూరు మండలం నరసాపురం, సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి, షళంత్రి గ్రామాల్లో సమైక్యవాదులు ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు.  ఇచ్ఛాపురంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగా యి. వీరికి జర్నలిస్టులు, విద్యార్థులు సంఘీభావం తెలిపి మౌనప్రదర్శన నిర్వహించారు. కంచిలి మండలం తలతంపరలో బంద్ నిర్వహించి ర్యాలీ జరిపారు. సోంపేటలో లగేజీ ఆటో కార్మికులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. టీడీపీ నేతలు నిరాహారదీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు.
 
  పలాస-కాశీబుగ్గలో విద్యార్థులు, కార్మికులు భారీ ర్యాలీ లు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీనివాసలాడ్జి కూడలి వద్ద మానవహారాలు చేపట్టారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. పలాస మండలం గోపాలపురం పాత జాతీయ రహదారిని విద్యార్థు లు దిగ్బంధించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వజ్రపుకొత్తూరులో గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహ నం చేశారు.  పాతపట్నంలో శనివారం నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement