లాఠీ పట్టిన రైతు బిడ్డ

31 Jul, 2019 09:27 IST|Sakshi
కూతురు భారతికి స్వీటు తినిపిస్తున్న తల్లిదండ్రులు చెన్నకేశవరెడ్డి, సుజాత 

ఎస్‌ఐగా ఎంపికైన భారతి

ఫ్యాక్షన్‌ గ్రామం నుంచి పోలీసుశాఖలో ఉద్యోగం

సాక్షి, ముద్దనూరు : రైతు బిడ్డ లాఠీ పట్టింది. ఫ్యాక్షన్‌ గ్రామంగా ముద్ర పడిన ఊరి నుంచి పోలీసుశాఖలో సివిల్‌ ఎస్‌ఐ ఉద్యోగం సాధించిన బుట్టెయ్యగారి భారతి శభాష్‌ అనిపించుకుంటోంది. ముద్దనూరు మండలంలోని కొర్రపాడు ఫ్యాక్షన్‌ గ్రామంగా ముద్రపడింది. ఈ గ్రామంలో నివసించే చెన్నకేశవరెడ్డి, సుజాత దంపతుల మొదటి సంతానం భారతి. ఈమె తండ్రి చెన్నకేశవరెడ్డి   కొర్రపాడులో సాధారణ రైతు. ఆయన కష్టం చూసిన భారతి పట్టుదలతో క్రమశిక్షణతో చదివింది. ఇటీవలే రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌)లో కానిస్టేబుల్‌గా కూడా ఎంపికైంది. కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరకుండానే ఎస్‌ఐ ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్‌ తీసుకుంటూ ఎస్‌ఐ నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తుచేసి మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా ఎంపికైనట్లు భారతి తెలిపారు. ఈమె 10వ తరగతి స్వగ్రామమైన కొర్రపాడులో, ఇంటర్మీడియట్, డిగ్రీ పులివెందులలో పూర్తి చేసింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన తమ బిడ్డ పోలీసుశాఖలో ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని  భారతి తల్లిదండ్రులు సుజాత, చెన్నకేశవరెడ్డిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు