ఫిబ్రవరిలో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

1 Feb, 2015 11:22 IST|Sakshi

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరిలో గుంటూరు మీదుగా హైదరాబాద్కు ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

విజయవాడ-సికింద్రాబాద్ మధ్య..
ఫిబ్రవరి 5,12వతేదీల్లో విజయవాడ-సికింద్రాబాద్ ప్రతేక రైలు (నంబరు07207) రాత్రి 11గంటలకు విజయవాడలో బయలుదేరి మంగళగిరి, గుంటూరు, నల్లగొండల మీదుగా సికింద్రాబాద్‌కు మరుసటి రోజు తెల్లవారుజామున 5.40కి సికింద్రాబాద్  చేరుకుంటుంది.

ఫిబ్రవరి 8,15వ తేదీల్లో సికింద్రాబాద్-విజయవాడ ప్రత్యేక రైలు (07208) రాత్రి 11.15కు సికింద్రాబాద్‌లో బయలు దేరి నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా ఉదయం 5.45కి విజయవాడ చేరుకుంటుంది.

కాకినాడ-సికింద్రాబాద్ మధ్య..
ఫిబ్రవరి 6,13వ తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు (07202) రాత్రి 7.15 కు సికింద్రాబాద్లో బయలు దేరి నల్లగొండ,  సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు,తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా మరుసటిరోజు కాకినాడకు చేరుకుంటుంది.

ఫిబ్రవరి 7,14వతేదీల్లో కాకినాడటౌన్-సికింద్రాబాద్ మధ్య  ప్రత్యేక రైలు (07201) సాయంత్రం 6.30 కు కాకినాడలో బయలుదేరి  సామర్లకోట, రాజమండ్రి,తాడేపల్లిగూడెం, ఏలూరు,విజయవాడ, గుంటూరు మీదుగా మరుసటిరోజు ఉదయం 5.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

మరిన్ని వార్తలు