25 Dec, 2017 08:58 IST|Sakshi

సాక్షి: ఢిల్లీలో దట్టంగా పొగమంచు అలుముకున్నది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నిటి వేళల్లో మార్పులు చేశారు. 17 రైళ్లను రద్దు చేయగా 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు