బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు

12 May, 2020 12:05 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే గ్రామాల్లోని అన్ని వీధుల్లో మంత్రులు, ఎంపీల బృందం పర్యటించి గ్రామస్ధులతో మాట్లాడారు. గ్రామాలలో బ్లీచింగ్ చల్లడం, శానిటైజేషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగం 700 మంది శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. నేడు కూడా బాధితులకి ఆయా గ్రామాల్లోనే భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భోజనం సిద్ధం చేయడానికి ప్రతీ గ్రామంలో 50 మందికి పైగా వంట చేసేవారిని ఏర్పాటు చేశారు. సుమారు పది వేల మందికి పైగా ప్రజల కోసం అయిదు గ్రామాల్లో భోజనం సిద్ధమతోంది. ప్రతీ గ్రామంలో భోజనాలు తయారు చేసి అక్కడే అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితుల భోజనం మెనూలో వెజిటబుల్ బిర్యానీ, పెరుగు చట్నీ, రైస్‌తో పాటు బంగాళా దుంప కూర, ఎగ్ కర్రీ, పప్పు, సాంబారు, పెరుగు, స్వీటు, అరటి పండు అందించనున్నారు.

>
మరిన్ని వార్తలు