దెయ్యాలు.. డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్

18 Aug, 2014 00:33 IST|Sakshi
దెయ్యాలు.. డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్

 రాజమండ్రిసిటీ : దెయ్యాలు డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్.. అంటూ ‘గీతాంజలి ’ సినిమా హీరోయిన్ అంజలి సినిమా యూనిట్‌తో స్థానిక స్వామి థియేటర్‌లో హల్‌చల్ చేసింది. ‘గీతాంజలి’ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం రాజమండ్రి చేరుకుంది. చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్ తొలుత షెల్టాన్ హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ హిట్,..ఫ్లాప్ తప్ప చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదన్నారు.
 
 తమ చిన్నప్రయత్నానికి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘గీతాంజలి’ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 కోట్ల వ్యాపారం చేసిందన్నారు. అనంతరం స్వామి థియేటర్‌కు వెళ్లిన యూనిట్‌కు ఘన స్వాగతం లభించింది. హీరోయిన్ అంజలి తనకు వేసిన పూలమాలలు ప్రేక్షకులపైకి విసిరి సినిమా విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన తాను ‘గీతాంజలి’ విజయం పంచుకునేందుకు ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెరైక్టర్ రాజ్‌కిరణ్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్ సాయిశ్రీ రమణ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
 
 కాకినాడలో...
 కల్చరల్(కాకినాడ) : గీతాంజలి చిత్ర యూనిట్ విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కాకినాడ మల్టిప్లెక్స్ థియేటర్‌కు విచ్చేసింది. యూనిట్ సభ్యులకు కవిత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ చౌదరి, రాజు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర సమర్పకుడు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. నటి అంజలి, డెరైక్టర్ రాజ్‌కిరణ్ చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నటులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, మధు ప్రేక్షకులను అలరింపజేశారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, మల్టిప్లెక్స్ థియేటర్ రెడ్డి  పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలు : అవంతి

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

‘అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై పునఃసమీక్ష’

తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి

శ్రీపూర్ణిమ‌ గ్రంథాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగ‌న్

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్‌ కమిటీ

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

ఆర్‌ అండ్‌ ఆర్‌లో భారీ అక్రమాలు: జీవీఎల్‌

దాతల విస్మరణ.. మాజీల భజన..!

పోలీస్‌స్టేషన్‌లో దౌర్జన్యం

కలక్టరేట్‌ ఎదుట యువతి ఆత్మాహత్యాయత్నం

చంద్ర డాబు

అటవీ శాఖలో అవినీతి వృక్షం

పర్యాటకుల్ని మింగేస్తున్న సరియా జలపాతం..

వృత్తి ఆటోడ్రైవర్‌.. విదేశీయులకు సైతం మెలకువలు

ఆ హాస్పిటల్‌ను మూసివేశాం : మంత్రి ఆళ్ల నాని

పోలవరం ప్రాజెక్ట్‌ ఏపీకి సంజీవిని : అనిల్‌ కుమార్‌

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

రా‘మాయ’పట్నమేనా..!

గోదాముల్లో రికార్డుల గందరగోళం

12 సర్కిల్‌ స్టేషన్లను ప్రారంభించాల్సి ఉంది

కడలి కెరటాలకు యువకుడి బలి

అక్రమాల ఇంద్రుడు

బెల్టుషాపుల రద్దుతో నాటు.. ఘాటు!

గత పాలకుల నిర్లక్ష్యంవల్లే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!