ఆన్‌లైన్‌లో ఆరోగ్యం!

20 Jul, 2014 00:52 IST|Sakshi

రాజస్థాన్ తరహా సాంకేతిక వ్యవస్థ
 
హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చిన రోగి వివరాలు, ఔషధాల పేర్లను కంప్యూటర్‌లో నమోదు చేసేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అనుసరించనున్నాయి. త్వరలో ‘సి-డాక్’ అనే సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని సుమారు 1,709 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆన్‌లైన్ సేవల కోసం సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకునేందుకు సుమారు రూ.34 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

నాలుగు నెలల క్రితమే ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం నేతృత్వంలో రాజస్థాన్‌లో పర్యటించి కసరత్తు చేశారు. దీనివల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలు మరింత చేరువవుతాయి.  జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులతో పీహెచ్‌సీల కోసం రూ.10 కోట్లు వెచ్చించి ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారు.
 

>
మరిన్ని వార్తలు