హైదరాబాద్పైనే పీటముడి

25 Nov, 2013 20:20 IST|Sakshi
హైదరాబాద్పైనే పీటముడి

న్యూఢిల్లీ: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజనపై  ఇంతకాలం కసరత్తు చేసి తయారు చేసిన నివేదికను జిఓఎంఆమెకు అందజేసింది. సమావేశంలో గంటన్నరసేపు చర్చించారు.  హైదరాబాద్పైనే పీటముడిపడినట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిని ఉమ్మడి రాజధానిగా చేస్తే సీమాంధ్రుల హక్కులకు రక్షణ లభిస్తుందని జిఓఎంలోని ఒక సభ్యుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.  

ఈ నెల 27న జిఓఎం తుది సమావేశం జరుగుతుంది. సోనియా గాంధీ ఇప్పుడు ఇచ్చిన సలహాల ఆధారంగా తుది నివేదిక రూపొందించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జయరామ్, ఎకె ఆంటోనీ,  దిగ్విజయ్ సింగ్, చిదంబరం  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు