సిద్దిపేటలో భారీ చోరీ

2 Jan, 2014 23:30 IST|Sakshi

సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని అపార్ట్‌మెంట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటలోని సీతారామాంజనేయ థియేటర్ వెనుక భాగంలో ఉన్న రావూస్ రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 101లో గన్‌రాత్ భీమేష్ నివాసముంటున్నారు. ఈయన శివాజీ నగర్‌లో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఓ పని నిమిత్తం మంగళవా రం రాత్రి ఆయన తానుంటున్న ఫ్లాట్‌కు తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం ఉదయం ఆయన తన ఫ్లాటుకు వచ్చేసరికి తలుపు తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా.. బెడ్‌రూం, బీరువా తాళాలు కూడా బద్దలై ఉన్నాయి. దీంతో ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశా రు. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ నాగభూషణంలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం సంగారెడ్డి నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను ర ప్పించారు. కుక్క అపార్ట్‌మెంట్‌లోని ప లు ప్రాంతాలను తిరిగి హైదరాబాద్ రో డ్డుపైకి వెళ్లి తిరిగి మళ్లీ వాహనంలోకి వ చ్చి కూర్చొంది. క్లూస్ టీం వివిధ వస్తువులపై ఉన్న వేలి ముద్రలను సేకరిం చారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీసు లు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు.
 
 బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు చైన్, నాలుగు తులాల బంగా రు నెక్లెస్, 2 తులాల చైన్, 3.5 తులాల కమ్మలు, 2 తులాల ఉంగరాలు, 0.5 తులం కాయిన్, 3 తులాల బంగారు గాజులు మొత్తం 21 తులాల నగలు చోరీ అయినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం దాచిన భారీ మొత్తం కూడా అపహరణకు గురైనట్లు సమాచారం.
 
 ఇంట్లో చోరీ
 సంగారెడ్డి క్రైం : మండలంలోని గౌడిచెర్ల గ్రామ మాజీ సర్పంచ్ తలారి కృష్ణ ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తలా రి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం 11 గంటల సమయం లో ఇంటికి తాళం వేసి చేను వద్దకు వెళ్లారు. అనంతరం సాయంత్రం ఇంటి కి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం ప గులగొట్టి ఉంది. ఇంట్లో ఉన్న రూ. 46 వేల నగదు, తులం బంగారం దొంగలు అపహరించుకుని పోయారని బాధితుడు తెలిపారు. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు