విద్యార్థినిని గర్భవతిని చేసిన గురువు

5 Nov, 2013 13:02 IST|Sakshi

నల్లగొండ: విద్యార్థులకు చదువు, బుద్ది చెప్పవలసిన గురువే కీచకుడిగా వ్యవహరించాడు. చిలుకూరు మండలం రామాపురం ఓ గురువు తన విద్యార్థినిని గర్భవతిని చేశాడు.


ఆ విద్యార్థిని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఆ బాలికను గర్భవతిని చేశాడు. అంతే కాకుండా ఆ గర్భం తీయించడానికి ప్రయత్నించాడు. ఈ విషయాలు తెలిసి విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు.  డీఈఓ కలుగజేసుకొని ఆ కీచక గురువుని సస్పెండ్ చేశాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా