ఉస్మానియాలో మోపిదేవికి వైద్య పరీక్షలు

9 Aug, 2013 01:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్  కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను వైద్య పరీక్షల నిమిత్తం గురువారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆయన వెన్నునొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆయన జైల్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రిలోని మెడికల్ బోర్డులో మోపిదేవికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 12న సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోపిదేవిని ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు తరలించారు. మెడికల్ బోర్డు ఇచ్చే నివేదికను కోర్టుకు అందించనున్నట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి.సైదయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు