మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు

15 Jul, 2014 02:37 IST|Sakshi
మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు

రిమ్స్‌క్యాంపస్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగకుండా ఉన్న మున్సిపాల్టీల్లో ఎలక్షన్లు నిర్వహించేందుకు మంత్రివర్గం నిర్ణయిం చిందన్నారు. దీంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న శ్రీకాకుళం, రాజాం మున్సిపాలిటీలకు కూడా  మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళానికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వారితో చర్చలు జరిపి.. వారిని ఒప్పించి ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు.
 
 సూర్యదేవుని సమస్యల పరిష్కారానికి సహకరిస్తా
 శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు అన్నా రు. సోమవారం స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ సమస్యలను శాసనసభ్యుల ద్వారా తనకు తెలియజేస్తే వాటిని దేవాదాయశాఖ కమిషనర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్య అన్నదాన పథకంపై ఈవోతో చర్చించారు.
 
 ఇక్కడ జరుగుతున్న నిత్య అన్నదాన పథకం ఇంకా పెంపు చేయాలని కోరారు. నిర్మాణం లో ఉన్న టూరిజం హోటల్, టీటీడీ నూతనంగా నిర్మించనున్న కల్యాణ మండపం వివరాలను మంత్రికి అధికారులు, అర్చకులు వివరించారు. నాలుగేళ్లుగా ఏడాదికి మూడు కోట్ల రూపాయలకు మించిన ఆదాయం వస్తుందని, దీన్ని డీసీ స్థాయికి పెంచాల్సిన అవశ్యకత ఉందని మంత్రిని కోరారు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్న విషయాన్ని అచ్చెన్న దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని అన్నారు. అనివెట్టి మండపంలో ఆలయ ప్రధానఅర్చకుడు ఇప్పిలి శం కరశర్మ మహాదాశీర్వవచనం చేసి, స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని మంత్రికి సమర్పించారు. ఈయనతోపాటుగా ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి, ఆర్డీవో జి.గణేష్, ఈవో ఆర్.పుష్పనాథం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు