నా పదవి జనగామకేఅంకితం

29 Mar, 2014 01:56 IST|Sakshi
నా పదవి జనగామకేఅంకితం
  •      గుమాస్తా కొడుకును ఈ స్థారుుకి చేరుకున్నా..
  •      నా బలం..ఊపిరి జనగామ జనమే
  •      టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
  •      పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జనగామకు రాక
  •      విలేకరుల సమావేశంలో భావోద్వేగం
  •  జనగామ, న్యూస్‌లైన్ : ‘నాకు దక్కిన  పీసీసీ పదవిని జనగామ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్నా.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకైనట్టుగా.. తాను పీసీసీ అధ్యక్షుడినైనా జనగామ జనానికి బిడ్డలాంటోడిని’ అని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీపీపీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గమైన జనగామకు శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పొన్నాల మాటలను మొదలు పెట్టగానే ఆయన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.

    గద్గద స్వరంతో మాట్లాడారు. జనగామ జనం ఆదరాభిమానాలే తన బలం.. ఆయుష్సు.. ఊపిరి అని అన్నా రు. 30 ఏళ్లు తనను బిడ్డగా ఆదరించారని, వారి దయ వల్లే గుమాస్తా కొడుకునైన తాను.. నేడు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. చిన్న నాటి నుంచి ఎన్నో కష్టాలకోర్చి చదువుకున్నానన్నారు. కరీంనగర్ జిల్లా దండేపల్లిలో ఓ భూస్వామి వద్ద తన తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడని, తన తండ్రి 1945లోనే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడని, ఇందుకు సంబంధించిన రశీదును 1991 వరకు భద్రంగా దాచినట్లు పొన్నాల తెలిపారు. అయితే ఖిలాషాపూర్‌లో నక్సలైట్లు జరిపిన పేళుల్లలో ఆస్తి, దాచుకున్న పత్రాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.

    నిరుపేద కుటుంబంలో ఉన్న తాను ఉన్నత చదువులు చదివి అమెరికాలో అంతరిక్ష పరిశోధనలో తన సాంకేతికతను అందిచానని వివరించారు. స్వదేశానికి తిరిగివచ్చి 1978లో జనగామలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా చేరానని, 1985 వరకు కూడా కార్యకర్తగానే కొనసాగానని, మొదట జిల్లా కాంగ్రెస్ కోశాధికారిగా, ఆ తదుపరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశానని అన్నారు. అంచె లంచెలుగా ఎదుగుతూ సుధీర్ఘ కాలం మంత్రిగా కొనసాగానని ఆయన తన రాజకీయ జీవితాన్ని వివరించారు. గత పన్నెండేళ్లుగా పీసీసీ పదవి వచ్చినట్టే వస్తూ చేజారిందని, చివరకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన చారిత్రాక సమయంలో  తొలి పీసీసీ పదవి వరించడం తనకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.  
     
    1955లోనే..

     
    1955లోనే నైజాంను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో చదివే విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారని పొన్నాల చెప్పారు. విశాలాంధ్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆనాడే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ నినదించిన రోజులు మరిచిపోలేనివన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయన్నారు.

    2001లో 42 మంది ఎమ్మెల్యేలము మొదటి సారిగా తెలంగాణను ఏర్పాటు చేయాలని సంతకాలు చేశామని, 1991లో తెలంగాణ అభివృద్ధికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లగా ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపిన మంత్రిని తానేనని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధికి పాటుపడుతూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన జనగామ ప్రజలకు జన్మంతా రుణపడి ఉంటానన్నారు.

    విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పొన్నా ల వైశాలి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నాయిని రాజేందర్, ఈ వీ శ్రీనివాస, రాజనాల శ్రీహరి, ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు, హరిరమాదేవి, జంగా రాఘవరెడ్డి, బండా ప్రకాష్, జనగామ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, నాయకులు రంగరాజు ప్రవీణ్, బుచ్చిరెడి,్డ ఎం.రవీందర్, జక్కుల వేణుమాధవ్, మున్సిపల్ వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.
     
    కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలి : రోడ్ షోలో పొన్నాల  

     జనగామ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి దోహదపడాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మధ్యాహ్నం జనగామలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. టీ పీసీసీ పదవి వచ్చిన తర్వాత తొలిసారిగా జనగామకు రావడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం పెంబర్తి నుంచి మొదలైన రోడ్ షో జనగా మ ఆర్టీసీ చౌరస్తా, అక్కడి నుంచి నెహ్రూ పార్కు, రైల్వేస్టేషన్, గుండ్లగడ్డ మీదుగా అంబేద్కర్ నగర్ చమన్ వరకు సాగింది.

    ఈ సందర్భంగా పొన్నాల పట్టణ ప్రజలకు అడుగడుగునా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక దేవి థియోటర్ వద్దకు చేరుకునేసరికి ప్రచార సమయం అయిపోవడం తో పోలీసులు ఆయన వాహనాన్ని ఆపివేశా రు. దీంతో సొంత వాహనంలో పట్టణ కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందు రోడ్ షోలో పొన్నాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో ఇప్పటికే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన జనగామ పట్టణాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్థాని క సంస్థల ఎన్నికల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.

    80 శాతం కేంద్ర ప్రభుత్వ, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధుల తో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకా రం ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, సుధాకర్, రవీందర్, బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రవీన్, ధర్మపురి శ్రీనివాస్, జెక్కుల వేణు మాధవ్‌తోపాటు పట్టణంలోని 28 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు.
     
    పొన్నాలతో నారాయణ భేటీ
     
    సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో జనగామలోని ఆయన నివాసంలో భేటీ అయ్యూరు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత నారాయ ణ వెళ్లిపోయూరు. అరుుతే నారాయణ బయటకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తాను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పరిచయం చేసుకోగా స్పందించిన నారాయణ ‘అరె.. ఆ సీటును మేము అడుగుతున్నం కదా’ అని అన్నారు. అక్కడే ఉన్న పొన్నాల వెంటనే స్పందించి ‘ఆ సీటు అడగొద్దు’ అనితన దైన శైలిలో అన్నారు. దీంతో నారాయణ కూడా సరేలే అని అక్కడి నుంచి వెళ్లిపోయూరు.

మరిన్ని వార్తలు