వైఎన్‌ కళాశాలకు అరుదైన గుర్తింపు 

9 Sep, 2019 10:09 IST|Sakshi
విలేకరుల సమావేశంలో పరామర్ష్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న యాజమాన్యం

సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన నరసాపురం వైఎన్‌ కళాశాల స్థాయి పెరిగింది. మెంటారు కళాశాలగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) దీనిని గుర్తించింది. యూజీసీ దేశంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి రూపొందించిన పరామర్ష్‌ పథకానికి వైఎన్‌ కళాశాలను ఎంపిక చేసింది. దేశంలో మొత్తం 167 కళాశాలలను ఈ పథకానికి యూజీసీ ఎంపిక చేసింది.  రాష్ట్రంలో 10 కళాశాలలు, తెలంగాణలో 4 కళాశాలలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని 10 కళాశాలల్లో జిల్లాకు సంబంధించి ఒకటి వైఎన్‌ కశాశాల కాగా, రెండోవది ఏలూరు సెయింట్‌ థెరిస్సా కళాశాల. కొన్ని జిల్లాల్లో కళాశాలలకు, యూనివర్సటీలకు ఈ అవకాశం దక్కకపోవడం గమనార్హం. కళాశాలలోని మౌలిక వసతులు, బోధనా పద్ధతులు, ప్రొఫెసర్ల సామర్థ్యం, గత చరిత్ర తది తర అంశాలను పరిగణలోకి తీసుకుని వైఎన్‌ కళాశాలను ఎంపిక చేశారు. ఇప్పటికే వైఎన్‌ కళాశాల నాక్‌ ఏ గ్రేడ్‌ను మూడుసార్లు సాధించింది. 

డీమ్డ్‌ యూనివర్సిటీకి మార్గం సుగమం
వైఎన్‌ కళాశాలను డీమ్డ్‌ యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం సాగుతోంది. మెంటారు కళాశాలగా గుర్తింపు దక్కడం ద్వారా దీనికి మార్గం సుగమం అయ్యిందని కళాశాల ఇన్‌చార్జ్‌ సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ పోలిశెట్టి రఘురామ్, ప్రిన్సిపాల్‌ కె.వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌ఎం మహేశ్వరి, ఐ క్యూఏసీ కో–ఆర్డినేటర్లు డాక్టర్‌ కె.నాగేశ్వరరా వు, డాక్టర్‌ గంధం రామకృష్ణ ఆదివారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా గుర్తింపుతో రూ.30 లక్షలు గ్రాంట్‌ వస్తుందన్నారు. తమ కళాశాల ఉభయగోదావరి జిల్లాల్లోని ఐదు కళాశాలలను ఎంపిక చేసుకుని వాటికి నేక్‌ గుర్తింపు వచ్చేలా కృషిచేయాలన్నారు. దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినిమిల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారని చెప్పారు. తాము భీమవరం వబిలిశెట్టి సత్యనారాయణ, కృష్ణమూర్తి కళాశాల, తాళ్లపూడి కలిదిండి సుబ్బారావు మెమోరియల్‌ డిగ్రీ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు దీప్తి కళాశాల, అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, లక్కవరం అల్లూరి వరలక్ష్మి కళాశాలను ఎంచుకున్నామని చెప్పారు. డాక్టర్‌ చినిమిల్లి శ్రీనివాస్, ట్రెజరర్‌ పొన్నపల్లి శ్రీరామారావు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎదురు చూపులేనా?

తమ్మిలేరుపై ఆధునికీకరుణ 

యువకుడి ఆత్మహత్య

జగన్‌తోనే మైనారిటీల అభివృద్ధి

‘దసరా ఉత్సవాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది’

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి...

క్యాష్‌ కొట్టు.. ఫిట్‌నెస్‌ పట్టు

గ్రామ సచివాలయంలో 583 లైన్‌మెన్‌ల నియామకం

హత్యా... ఆత్మహత్యా!

అచ్చెన్నా... నీ బండారం బయటపెడతా...

ప్రళయ గోదావరి!

శతశాతం.. చరిత్రాత్మకం!

74 ఏళ్ల వయసులో మాతృత్వం.. తీవ్ర విమర్శలు

ప్రియురాలిపై కత్తితో దాడి..

శ్రీవారికి కానుకల అభిషేకం

అమరావతిలో మూడు రోడ్లు, ఆరు బిల్డింగ్‌లే!

3,285 కిలో మీటర్లు 

శతవసంతాల కల.. సాకారమైన వేళ

మళ్లీ పోటెత్తుతున్న నదులు

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు 

ప్రమాణాల పెంపునకు ‘పరామర్శ్‌’ 

రుణాల పంపిణీకి ఉమ్మడి ప్రణాళిక 

సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు

ఈనాటి ముఖ్యాంశాలు

మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

వైఎస్‌ జగన్‌ది ప్రపంచ రికార్డు

'డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది'

'ముస్లింలకు మాపార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుంది'

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి