విభజన జరిగితే బోర్డు చూసుకుంటుంది: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం శ్రీవాత్సవ

23 Dec, 2013 15:56 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే రైల్వే వ్యవహారాన్ని బోర్డు చూసుకుంటుందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం శ్రీవాత్సవ చెప్పారు. బోర్డు అడిగినప్పుడు తగిన సమాచారాన్ని ఇస్తామన్నారు. ఉద్యమాల వల్ల రైల్వేకు ఎటువంటి నష్టం సంభవించలేదని చెప్పారు.

ప్రయాణికులు రద్దీగా ఉన్న మార్గంలో అదనపు బోగీలను కేటాయిస్తామన్నారు. ఎంఎంటీస్ రెండో విడత పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ముంబై రైళ్ల సమాచారం మొబైల్‌లోకి అందుబాటులోకి తెస్తామన్నారు.  రైల్వేస్టేషన్‌లలో హెల్ప్ బూత్‌లను ఏర్పాటు చేస్తామని  శ్రీవాత్సవ చెప్పారు.

మరిన్ని వార్తలు