దూసుకొస్తున్న‘ పెథాయ్‌’ తుపాను

16 Dec, 2018 16:28 IST|Sakshi

సాక్షి, విశాఖ పట్నం : వాయువేగంతో దూసుకొస్తున్న ఫెథాయ్‌ తుపాను కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకొని కొనసాగుతున్న తుపాను మచిలీ పట్నానికి తూర్పు ఆగ్నేయంగా 560 కిలో మీటర్లు, కాకినాడ దక్షిణ ఆగ్నేయంగా.. శ్రీహరికోటకు 450 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఫెథాయ్‌ తుపాను ఉత్తర వాయవ్య దిశగా గంటకు 20 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను  తీవ్ర తుపానుగా మారింది. సోమవారం మధ్యాహ్నానానికి వాయుగుంగం బలహీనపడి కాకినాడ, తుని మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

తీరం దాటే సమయంలో 100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, 6మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని పోర్టుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100 ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లంతా సురక్షితం. జాలర్లతంగా సురక్షితంగా తీరానికి చేరారు. సుముద్రంలో ఉండిపోయిన ప్రకాశం జిల్లాకు చెందిన జాలర్లకు ఆశకావాణి ద్వారా సందేశాలు పంపించాం. తుపాను హెచ్చరికలు విని తిరుగు ప్రయాణమైన జాలర్లు ఆదివారం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.  - రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ( ఆర్టీజీఎస్‌)

కాకినాడ పరిసర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటుతుంది. తీర ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ నెల 18న ఓ మోస్తరు, రాయలసీమలో తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది- వైకే రెడ్డి, వాతావరణ శాఖ డైరెక్టర్‌

తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి, మలికిపురం మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మూడు గంటలుగా కరెంట్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లా  బోగాపురం మండలం కోయ్యపేడలో ఈదురగాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి కొబ్బరిచెట్లు విరిగిపడి  ఆవు మృతి మృతి చెందింది.
 

>
మరిన్ని వార్తలు