ఠాణాలో లిక్కర్ మామూళ్ల వార్

29 Aug, 2013 03:21 IST|Sakshi

వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ :  నగరంలోని ఒక  పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మధ్య లిక్కర్ వార్ జరుగుతోంది. మామూళ్ల విషయంలో తేడా రావడంతో ఏకంగా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఒకేస్టేషన్‌లో ఇద్దరు అధికారులు మామూళ్ల కోసం పట్టుబడుతుండడం లిక్కర్ షాపుల యజమానులకు శాపంగా మారింది. వారి కోపాగ్నికి లిక్కర్ షాపు యజమానులు బలవుతున్నారు. అటు మామూళ్లు ఇచ్చి కటకటాలలో కూర్చోవాలా అంటూ సదరు అధికారులను బహిరంగంగానే నిలదీయడం చర్చనీయంశంగా మారింది. చిలికి..చిలికి గాలివానగా మారిన మామూళ్ల వ్యవహారం బాస్ వద్దకు చేరింది. ఆయన తీవ్రస్థారుులో విరుచుకుపడినా పరిస్థితిలో మార్పు వచ్చినట్టు కనిపించడంలేదు.
 
నాలుగు రోజుల క్రితం..


 నాలుగు రోజుల క్రితం నగరంలోని ఒక బార్ షాపుపై స్థానిక ఎస్సై దాడి చేశారు. అర్ధరాత్రి, అపరాత్రిఅంటూ నిబంధనల పేరుతో యజమానిని వేధించారు. సదరు యజమానిపై పరుష పదజాలం ప్రయోగిస్తూ బలవంతంగా అతడిని స్టేషన్‌కు లాక్కొచ్చారు. దీంతో ఆగ్రహించిన సదరు బార్ యజమాని తనను బలవంతంగా తీసుకొచ్చిన ఎస్సైపై తిరుగబడ్డాడు. మామూళ్లు తీసుకోవడం లేదా ? మీ సార్‌కు ప్రతీ నెలా రూ.10 వేలు ఇస్తున్నార  కదా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ నిలదీశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎస్సై తనకు మామూళ్లు ఇవ్వడం లేదనే విధంగా మాట్లాడినట్టు సమాచారం. ఠాణాలో మామూళ్ల గొడవపై సదరు బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఆ నోటా ఈ నోటా రేంజ్ అధికారికి తెలియడంతో సదరు ఠాణా ఇన్‌స్పెక్టర్‌ను మందలించినట్లు సమాచారం. ప్రవర్తనలో మార్పు రాకుంటే వేటు తప్పదనే హెచ్చరికలు జారీచేసినట్లు తెలిసింది.
 
రోజుల తరబడి తిరగాల్సిందే..

 ఇదిలా ఉండగా ఆ స్టేషన్ పరిధిలో చిన్నగొడవ అ రుునా రోజుల తరబడి తిరగాల్సిందేనని బాధితు లు వాపోతున్నారు. ప్రతీరోజు స్టేషన్‌కు రమ్మని పి లవడం సమస్య కొలిక్కి తేకుండా రేపు...రా... అం టూ ఇలా రోజుల తరబడి తిప్పడం వెనుక మతలబు ఏమిటని పలువురు బహిరంగంగానే చర్చిం చుకుంటున్నారు. ఈ స్టేషన్‌లో ఇద్దరు అధికారుల కు పొసగకపోవడంతో బాధితులు తీవ్రఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

మరిన్ని వార్తలు