ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

16 Apr, 2017 08:26 IST|Sakshi

వైఎస్‌ఆర్ జిల్లా: టీడీపీ నేతల దౌర్జన్యం మూలంగా వాయిదా పడిన ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో భారీగా పోలీసులు మోహరించారు. ఎన్నికల పరిశీలకులుగా జాయింట్‌ కలెక్టర్‌ శ్వేతను నియమించారు. ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా స్థానిక వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి ఉన్నారు.

గతంలో టీడీపీకి చెందిన చైర్మన్‌ గురివిరెడ్డి రాజీనామాతో మళ్లీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రొద్దుటూరులో మెత్తం కౌన్సిలర్‌ల సంఖ్య 40 ఉండగా.. వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యుల సంఖ్య 19గా ఉంది. కాగా ఇప్పుడు.. వైఎస్‌ఆర్‌ సీపీ తరఫున బరిలోకి దిగిన కౌన్సిలర్‌ ముక్తియార్‌కు ఏడుగురు టీడీపీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో శనివారం జరగాల్సిన ఈ ఎన్నికను టీడీపీ నేతలు ఓటమి భయంతో అడ్డుకున్నారు. కౌన్సిల్‌లో కోరం ఉండటంతో సంతకాలు తీసుకున్న అధికారులు.. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు. చైర్మన్‌గా పోటీలోకి దిగిన ముక్తియార్‌పై అధికార పార్టీ ఒత్తిళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. కాగా ముక్తియార్‌ వెనక్కి తగ్గకపోవడంతోనే టీడీపీ నేతలు బలవంతంగా ఎన్నికను ఆపారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు వెల్లడించారు.
 

>
మరిన్ని వార్తలు