సహరీ ఖరో..ఉఠో..!

12 Jun, 2018 09:21 IST|Sakshi
డప్పు వాయిస్తున్న ఫకీర్‌ సయ్యద్‌ సిద్ధివుల్లా

రంజాన్‌ మాసంలో ఫకీర్ల దండోరా

ప్రతి వీధిలో తెల్లవారు జాము తప్పనిసరి

పుణ్యకార్యంగా భావిస్తున్న ఫకీర్లు

మదనపల్లె సిటీ: ‘అయ్‌ రోజే దారో.. ఉఠో హరీ ఖరోరం..’ ముస్లింలు నివాసముండే ప్రాంతాల్లో తెల్లవారుజామున వినిపించే దండోరా ఇది. జూన్‌ మాసంలో పవిత్ర ఉపవాసదీక్షలు చేపట్టే ముస్లిం సోదరులను మేల్కొల్పేందుకు వీధుల్లో డప్పులు కొడుతూ, తమ మధుర స్వరంతో అల్లా శక్తిని పాటల రూపంలో పాడుతూ చేపట్టే కార్యక్రమం ఇది. తెల్లవారుజాము 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ముస్లింల నివాస ప్రాంతాల్లో ఫకీర్లు దాయారాతో నిద్రలేపుతారు. జిల్లాలో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కొందరు స్వచ్ఛందంగా ఈ పని చేస్తుండగా, మరి కొందరు ఫకీర్లు వారసత్వంగా కొనసాగిస్తున్నారు.

45 ఏళ్లుగా..
మదనపల్లె పట్టణం బడేమకాన్‌ దర్గాలో ఫకీర్లు దాదాపు ఐదుగురు ఉన్నారు. వీరి గురువు సయ్యద్‌ సిద్ధివుల్లా షాతో పాటు మరో నలుగురు శిష్యులు రోజూ ముస్లింలు ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని సహరీ కోసం నిద్ర లేపుతారు. ‘అప్పట్లో విద్యుత్‌దీపాలు లేకపోవడంతో లాం తర్లు పట్టుకుని వీధుల్లో తిరిగేవాళ్లం. తరాలు మారినా ఆ సంప్రదాయం అలాగే కొనసాగిస్తున్నాం. ఇషా నమాజు చదివి రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా తెల్లవారుజాము మూడు గంటలకే లేచి ఉపవాసదీక్షలకు సిద్ధమయ్యే ముస్లింలను మేల్కొల్పుతాం’ అని చెబుతారు సయ్యద్‌ సిద్ధి వుల్లా. మా చాటింపుతో ఎంతో మంది నిద్రలేచి ఉపవాసదీక్షలను పాటిస్తుంటారు. రంజాన్‌ రోజు ఇచ్చే కానుకలు తీసుకుంటూ అల్లాహ్‌ పై ఉన్న భక్తితో ఈ పని చేస్తున్నా. దీంతో ఎంతో సంతృప్తి కలుగుతుందని అంటారాయన.

మధురం.. కంఠస్వరం
సయ్యద్‌ సిద్ధివుల్లా కంఠస్వరం చాలా మధురంగా ఉంటుంది. ఎంత గాఢనిద్రలో ఉన్నా ఆయన కంఠస్వరం వినగానే ఒక్కసారిగా నిద్రలేచి సహరీకు ఏర్పాట్లు ప్రారంభిస్తాం అని చెబుతారు ఇక్కడి ముస్లింలు. దాదాపు 45 ఏళ్లుగా చాటింపు చెబుతున్న సిద్ధివుల్లా స్థానిక ముస్లింలకు సుపరిచితుడు. 

ఫకీర్లకే ప్రాధాన్యం..
గతంలో గడియారం, అలారమ్, సైరన్‌ మోతలు లేకపోవడంతో ఫకీర్లకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఫకీర్లు పొరపాటున చాటింపు వేయకపోతే అక్కడివారు సకాలంలో మేల్కొనకపోవడం వల్ల ఆరోజు వారు ఉపవాసదీక్షలను వదిలేయాల్సి వచ్చేది. కాలానుగుణంగా ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చినా ముస్లింలు మాత్రం ఇంకా ఫకీర్ల చాటింపుపైనే ఆధారపడుతున్నారు. ఫకీర్లు కాలినడకతో పాటు సైకిల్‌లపై డప్పు వాయిస్తూ .. మర్పా కొడుతూ.. డబ్బా వాయిస్తూ ముస్లింలను నిద్ర లేపుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రవిశేఖర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

వాన వెల్లువ

శాశ్వత భూహక్కులు

కాసుల కచ్చిడి

అవే కథలు.. అదే వంచన 

‘ఈడబ్ల్యూఎస్‌’కు  నేడు నోటిఫికేషన్‌ 

ప్రైవేటు చదువుల దోపిడీకి కళ్లెం!

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి షాక్‌

దేవుడు నా మొర ఆలకించాడు: పృథ్వీరాజ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

అయోమయ స్థితిలో కోడెల కుటుంబం

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..

గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదు..

పాము చచ్చాక ఇక కర్ర ఎందుకు: కృష్ణంరాజు

గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి

ఆగస్టు 1న జెరూసలేంకు సీఎం జగన్‌

చచ్చిపోవాలని రైల్వేస్టేషన్‌కొచ్చింది! ఆపై..

విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం

ఆంధ్ర, తెలంగాణల్లో రేషన్‌ అనుసంధానం

విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా?

క్వారీ..సర్కారు మారినా స్వారీ

నేను కూడా పోలీసులను అడగలేదు : డిప్యూటీ సీఎం

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

ఉద్యోగ విప్లవం

‘శివాజీ వెనుక చంద్రబాబు హస్తం’

ఓఎస్డీగా అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

హెరిటేజ్‌ మేనేజర్‌ కల్తీ దందా

భర్త ముందే భార్యతో ఫోన్‌లో..

వైద్యం.. ప్రైవేట్‌ రాజ్యం..! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌