వాయిదపడ్డ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రారంభం

8 Aug, 2013 10:19 IST|Sakshi

హైదరాబాద్ : వేలంపాటల వల్ల వాయిదా పడ్డ పంచాయతీల్లో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో అయిదు, గుంటూరు జిల్లాలో అయిదు, నిజామాబాద్ జిల్లాలో రెండు, కృష్ణా, నల్గొండ, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కొక్క గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది.

వేలం పాటలు నిర్వహించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ నిజామాబాద్ డివిజన్ వేల్పూర్ మండలం కోమన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటల లోగా ఫలి తాలు వెలువడుతాయి.

గుంటూరు జిల్లాలో వెల్దుర్తి  శిరిగిరిపాడు, కండ్లకుంట, వినుకొండ మండలం అందుగులపాడు, ఈపూరు మండలం ఊడిజర్ల, గురజాల మండలం గోగులపాడు, దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం, నరసరావుపేట మండలం ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం రొంపిచర్ల, ముత్తనపల్లి, నాదెండ్ల మండలం తూబాడు, గుంటూరు డివిజన్లోని చల్లావారిపాలెం గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 మంది సర్పంచ్్ అభ్యర్థులు, 118 వార్డులకు 260 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.28,264 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
 

మరిన్ని వార్తలు