పోలీసులపై కలప స్మగ్లర్ల రాళ్లదాడి

1 Feb, 2014 15:10 IST|Sakshi

వైఎస్సార్ జిల్లాలో కలప స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు, పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అటవీ ప్రాంతంలో దాదాపు 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ శాఖ అధికారుల బృందానికి కనిపించారు. వారిని పట్టుకోడానికి ప్రయత్నించగా రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. వారిలో ఒక స్మగ్లర్ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లేనని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఇంకా రైల్వే కోడూరు ప్రాంతంలోనే అధికారులు, పోలీసుల బృందం ఉన్నట్లు తెలుస్తోంది. స్మగ్లర్లను అదుపు చేసేందుకు అదనపు బలగాలను కూడా అక్కడకు మళ్లించారు. అయితే ఎంతమంది అధికారులు దాడిలో పాల్గొన్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. గతంలో చిత్తూరు జిల్లా బాకరాపేటలో కూడా రాళ్లతో కలప దొంగలు, స్మగ్లర్లు దాడి చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.

మరిన్ని వార్తలు