మూడు గంటలు మృత్యుపోరు

15 Jul, 2018 12:19 IST|Sakshi

ఎదురెదురుగా ఢీకొన్న లారీలు

తమిళనాడు వాసి దుర్మరణం

లారీల్లో ఇరుక్కుపోయిన మరో ఇద్దరు డ్రైవర్లు

చొరవ చూపిన స్థానికులు

ఇద్దరు డ్రైవర్ల ప్రాణాలు కాపాడిన వైనం

శనివారం వేకువజామున ఉదయం 5.30 గంటల సమయం. మదనపల్లెలోని నిమ్మనపల్లె సర్కిల్‌కు చెందిన కొందరు బసినికొండ పంచాయతీలోని ముంబ యి–చెన్నై జాతీయ రహదారి వైపు వాకింగ్‌కు వెళుతున్నారు. అమ్మా రక్షిం చండి.. కాపాడండి అన్న ఆర్తనాదాలు వినిపించడంతో పరుగులు తీశారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో క్యాబిన్లలో ఇరుక్కుపోయి రక్తమోడుతూ కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్న ఇద్దరిని గుర్తించారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఎంతకూ వీలుకాకపోవ డంతో పోలీసులకు సమాచారం అందిం చారు. వారు అక్కడికి చేరుకుని జేసీబీలు, క్రేన్ల సాయంతో ఇద్దరిని కాపాడారు. 

మదనపల్లె క్రైం : మదనపల్లె మండలం బసినికొండ సమీపంలో శనివారం వేకువ జామున రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ రమేశ్, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ కథనం మేరకు.. తమిళనాడు రాష్త్రం సేలం జిల్లా ఆర్తూరుకు చెందిన చక్రపాణి కుమారుడు రాజశేఖర్‌ (30), అదే ఊరికి చెందిన పలనివేలు కుమారుడు సెల్వ కుమార్‌ (27) డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరు సేలంకు చెందిన లారీ యజ మాని తంబికుమార్‌ ఆదేశాల మేరకు సేలంలో లారీలో సున్నం లోడు చేసుకుని శుక్రవారం రాత్రి కాన్పూర్‌కు బయలుదేరారు. శనివారం వేకువజామున 5.30 గంట లకు మదనపల్లె మండలం బసినికొండ సమీపంలోని ముంబయి–చెన్నై జాతీయ రహదారిలో ఉన్న ఉన్న నాలుగు కూడళ్ల వద్దకు చేరుకున్నారు.

అదే సమయంలో తాడిపత్రి నుంచి లారీలో నల్ల బండలను వేసుకుని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దూదేకుల ఖాశీంసాబ్‌ కుమారుడు మౌలా లి (26), అదే జిల్లా రావలూడికి చెందిన డ్రైవర్‌ చంద్రశేఖర్‌రెడ్డి(28) చెన్నై బయలుదేరారు. నాలు గు రోడ్ల కూడలిలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రాజశేఖర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చంద్రశేఖర్‌రెడ్డి కిందకు దూకేయ డంతో స్వల్పంగా గాయపడ్డాడు. సెల్వకుమార్, మౌలాలి తీవ్రంగా గాయపడ్డాడు. వారు రెండు లారీల క్యాబిన్లలో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేస్తుండడంతో అటుగా వాకింగ్‌కు వెళుతున్న స్థాని కులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 

మానవత్వం చాటుకున్న స్థానికులు
రక్త గాయాలతో బాధితులు మూడు గంటల సేపు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. ఆలస్యమయ్యే కొద్దీ వారి రోదనలు మిన్నంటాయి. రోడ్డుపై వెళుతున్న ప్రజలు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలం చేరుకుని క్షతగాత్రులను ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలని సుమారు మూడు గంటలకు పైగా విశ్వప్రయత్నాలు చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ రమేష్, ఎస్‌ఐ సునీల్‌తోపాటు పెద్దఎత్తున పోలీసు సిబ్బం ది, అగ్నిమాపక అధికారులు, స్థానికులు లారీ డ్రైవ ర్లు, మెకానిక్‌లు అక్కడికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న వైద్య దంపతులు నారాయణయ్య, అనూరాధ, 108 సిబ్బంది గోపి, సాంబ శివ క్షతగాత్రు లకు అక్కడే సెలైన్‌ బాటిల్స్‌ పెట్టి ప్రథమ చికిత్స చేశారు. చివరకు జేసీబీలు, క్రేన్ల సహాయంతో వారిని బయటకు తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వారి కుటుం బసభ్యులు బెంగళూరుకు తరలించారు. రాజశేఖర్‌ మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య శారద, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. 

స్తంభించిన ట్రాఫిక్‌
రెండు లారీలు ఢీకొనడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు లారీలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సకాలంలో స్పం దించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన స్థానికులను పోలీసులు అభినందించారు. సకాలంలో వైద్యం అందకపోయి ఉంటే వారు కూడా మృత్యువాత పడేవారని పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డబ్బు.. జాగ్రత్త!

కరోనాపై పకడ్బందీ చర్యలు

చంద్రబాబువి దుర్మార్గపు రాజకీయాలు

జంతువులకూ కరోనా పరీక్షలు

కరెంటుపై కరోనా ఎఫెక్ట్‌

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్