వేటు పడింది

30 May, 2015 11:34 IST|Sakshi

విశాఖపట్నం:

అనకాపల్లి రవాణాశాఖ కార్యలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నఅధికారులపై వేటు పడింది. విద్యార్హతలను పరిశీలించకుండా డైవింగ్ లైసెన్స్, బ్యాడ్జీలు అందించారని ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై పైఅధికారులకు రికార్డులు దొరకకుండా కింది స్థాయి ఉద్యోగులు మాయం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆర్డీవో మహ్మద్ సలీం,ఏఓ నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణి లపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం అర్ధరాత్రి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ రవాణాశాఖ కమిషననర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు