ఆగ్నేయ గాలులతో చలి తగ్గుముఖం

17 Jan, 2014 04:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండడంవల్ల చలి కాస్త తగ్గుముఖం పడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం ఉపరితలం నుంచి గాలులు వీస్తున్న కారణంగా తేమ ఎక్కువ శాతం నమోదవుతుందని తద్వారా కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో స్వల్ప మార్పులుంటాయన్నారు. ఒకటి, రెండుచోట్ల సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ మేఘాలున్నాయన్నారు. వర్షం కూడా పడుతోందన్నారు.

>
మరిన్ని వార్తలు