నేపాల్ ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను ఖండించిన స్వరూపానందేంద్ర

14 Jul, 2020 18:59 IST|Sakshi

సాక్షి, విశాఖప‌ట్నం :  శ్రీరాముని జ‌న్మ‌భూమిపై నేపాల్ ప్ర‌ధాని ఓలీ చేసిన వ్యాఖ్య‌ల‌ను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు.  రాముడు భార‌త‌దేశంలో జ‌న్మించాడ‌నేందుకు ఎన్నో చారిత్ర‌క సాక్ష్యాలున్నాయ‌ని వాటిని వ‌క్రీక‌రించ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు.  చైనా ప్ర‌ధాని కుట్ర‌ల‌కు అనుగుణంగా నేపాల్ ప్ర‌ధాని న‌డుచుకోవ‌డం దారుణ‌మ‌ని, ఇక‌నైనా నేపాల్ త‌ప్పుడు ప్ర‌చారాన్ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. శ్రీరాముని జ‌న్మ‌స్థ‌లం గురించి తెలిసీ తెలియ‌ని మాట‌లు స‌రికాద‌ని పేర్కొన్నారు.భార‌త్‌లో జ‌న్మించిన రాముడు ఎంతోమందికి  ఆరాధ్య దైవమ‌న్న స్వ‌రూపానందేంద్ర‌.. ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితాన్ని స‌మాజానికి  అందించిన దివ్య‌మూర్తి శ్రీరాముడ‌ని కొనియాడారు.  రాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య నేపాల్‌లోనే ఉంద‌ని, శ్రీరాముడు నేపాల్ దేశ‌స్తుడంటూ నేపాల్ ప్ర‌ధాని సోమ‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలోనూ భార‌త భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు త‌మ‌వేనంటూ నేపాల్ ప్ర‌ధాని ఓలీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.
 

 . 


 

మరిన్ని వార్తలు