ఎమ్మెల్యే నాపై కక్ష కట్టారు...

29 Oct, 2017 12:29 IST|Sakshi

అడుగడుగునా వేధిస్తున్నారు...

పార్టీ కోసం పని చేయడమే తప్పా...

టీడీపీ సర్పంచ్‌ ఆవేదన కేంద్ర మంత్రికి లేఖ 

జామి: గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తనపై కక్ష కట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ విజినిగిరి సర్పంచ్‌ కొమ్మినేని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వేధింపులపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు చెందిన విజయనగరంలోని అశోక్‌ బంగ్లాలో మూడు పేజీల లేఖను అందజేశారు. ఎమ్మెల్యే నాయుడు, మండల పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న గొర్రెపాటి శ్రీనువాసరావు కలసి తనను వేధిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. 

పార్టీ కోసం పని చేయడమే తప్పా అని ప్రశ్నించారు. పార్టీకి ఎన్నో సేవలందించిన తనపై  ఎమ్మెల్యే కక్ష కట్టారని ఆరోపించారు. పార్టీలో వర్గాలు ఏర్పాటు చేసి నష్టం కలుగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా రూ.70లక్షల పనులను వేరే వారికి అప్పగించారని ఆరోపించారు. తన చెక్‌పవర్‌ను రద్దు చేయించి, తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆవేదన చెందారు.  

మరిన్ని వార్తలు