కాణిపాకం హుండీలో తలనీలాలు చోరీ

25 Jan, 2016 09:26 IST|Sakshi
కాణిపాకం హుండీలో తలనీలాలు చోరీ

ఐరాల: చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ కల్యాణ కట్టలో ఉన్న హుండీని దుండగులు శనివారం వేకువన పగులగొట్టి తలనీలాలు చోరీ చేశారు. సీఐ ఆదినారాయణ కథనం మేరకు.. కాణిపాకంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు సమర్పించే తలనీలాలను హుండీల్లో వేస్తుంటారు.

దుండగులు ఆలయం వద్ద ఉన్న కల్యాణ కట్టలోని హుండీని భక్తుల స్నానపు గదుల వెనుకకు తీసుకువెళ్లి పగులగొట్టారు. అందులోని తలనీలాలు చోరీ చే శారు. ఉదయం అక్కడికి వచ్చిన గుత్తేదారు దీన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వచ్చి పరిసరాలను పరిశీలించారు. చిత్తూరు నుంచి వేలిముద్రల నిపుణులను రప్పించి వేలి ముద్రలు సేకరించారు. గుత్తేదారు మాట్లాడుతూ ఏడాదికి రూ. 56 లక్షలకు తాను టెండరు పొందానన్నారు. రెండు నెలల్లో టెండరు ముగియనుందని, ఈ సమయంలో హుండీ చోరీకి గురికావడంతో రూ. 7 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు