వారి ఆశయూనికిసలామ్

20 Oct, 2013 02:08 IST|Sakshi

, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన ఆరుగురు, బీఫార్మసీ విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు అంతా కలిపి మొత్తం 12 మంది సిబ్బందితో ఆశ్రమం ఆవరణలో పది పడకల ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించనున్నారు. పీజీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఆస్పత్రి రోజువారీ కార్యక్రమాలను నిర్వర్తిస్తారు.

సేవలు ఇలా


వైద్య సేవలు అంటే రోగం వచ్చిన తర్వాత మందుబిళ్ల, సూదిమందు ఇవ్వడం వంటి సాధరణ సేవలకే పరిమితం కావడం లేదు. రోగాలకు మూల కారణాలను వెతికి పట్టుకుని వాటికి సైతం మందు వేసేలా పక్కాగా  వైద్య సేవలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా సేవలను మూడు రకాలుగా విభజించారు. ప్రతీరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య ఆస్పత్రి పనిచేస్తుంది. ఈ సమయంలో వచ్చే రోగులను పరీక్షించి వైద్య సహాయం (ఓపీ) అందిస్తారు. ఆ తర్వాత వివిధ రోగాలకు సంబంధించిన వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. దీనితో పాటు ఫిజియోథెరపీకి సంబంధించిన వ్యాయామాలు చేయిస్తారు.

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చుట్టు పక్కల గ్రామాలకు (ఫీల్డ్ విజిట్) వెళ్తారు. ఇలా వెళ్లిన సమయంలో అక్కడి ప్రజల ఆరోగ్య స్థితి గతులను అడిగి తె లుసుకుంటారు. అంతేకాకుండా గ్రామాల్లో పరిశుభ్రత, అంటువ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణ- పచ్చదనంపై అవగాహాన వంటి కార్యక్రమాలను చేపడతారు. వీటిలో  ఓపీ, ఫీల్డ్ విజిట్ కార్యక్రమాల వేళలు రోజు విడిచి రోజు ఉదయం నుంచి సాయంత్రానికి, సాయంత్రం నుంచి ఉదయానికి మారుతాయి. వివిధ మెడికల్ ఏజెన్సీలు, ఎన్జీవోలు, ఔషధ కంపెనీలతో  సంప్రదింపులు జరిపి ఉచితంగా ట్యాబెట్లు, టానిక్‌లు, ఇంజక్షన్లు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
 60 పడకలకు విస్తరిస్తాం
 నవ ంబర్ 10న పది పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని ప్రారంభిస్తున్నాం. అదేరోజు 60 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తాం. ఈ భవనం పూర్తయ్యేలోపు మరికొంత మంది విద్యార్థులు అందుబాటులోకి వస్తారు. దానితో పూర్తిస్థాయిలో మా సేవలు సమాజానికి అందిస్తాం. పూర్తిగా దాతల సహాకారంతోనే ఈ భవన నిర్మాణం, ఫర్నిచర్ తదితర పనులు చేపడుతున్నాం
 - ఇన్నారెడ్డి, ప్రజాదరణ ఆశ్రమ నిర్వహకుడు
 

మరిన్ని వార్తలు