భక్తులను మెడపట్టి గెంటేసిన టీటీడీ ఉద్యోగులు

29 Nov, 2014 17:31 IST|Sakshi

వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై భక్తులకు, టీటీడీ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైను వద్ద ఈ వివాదం చోటుచేసుకుంది. ఆన్లైన్లో గ్రూప్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను లోపలకు అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఆందోళనకు దిగిన భక్తులను టీటీడీ ఉద్యోగులు మెడపట్టి బయటకు గెంటేశారు. వారికి స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించలేదు. ఇంత గొడవ జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.

రూ. 300 దర్శనం విషయంలో చాలాసార్లు ఇలా ఆందోళనలు జరిగాయి. క్యూలైన్ లోపలకు ప్రవేశించడానికి ముందే దర్శనానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని డిస్ప్లే బోర్డుల మీద రాయాలని భక్తులు పలు సందర్భాల్లో కోరినా టీటీడీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పేరుకే ప్రత్యేక ప్రవేశ దర్శనం తప్ప.. దీనికి కూడా గంటల తరబడి సమయం పడుతోందని భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు