నీటి కోసం..జాగారం

6 May, 2014 03:58 IST|Sakshi
నీటి కోసం..జాగారం

కల్వకుర్తి, న్యూస్‌లైన్: గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. దీంతో మహిళలు పొలానికి వెళ్లి పనిచేయడం మాని ప్రత్యేకంగా తాగునీటి కోసం వేచి ఉండే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులతో బిజీబిజీగా ఉండే గ్రామీణ ప్రజలు తాగునీటి కోసమే ఎక్కువ సమయం కేటాయించే దుస్థితి నెలకొంది. దీనికి తోడు విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో, ఉన్న కొద్ది పాటి నీటిని కరెంట్ వచ్చినపుడే సరఫరా చేస్తున్నారు. దీంతో మహిళలు రాత్రిళ్లు జాగారం చేస్తూ నీటికోసం పాట్లు పడుతున్నారు.

 నీళ్లున్నా..తప్పని తిప్పలు
 కొన్ని గ్రామాల్లోని బోర్లలో సరపడా నీళ్లున్నా నిర్వహణ లోపం, బోరుమోటార్లకు మరమ్మతు లు చేయించ కపోవడంతో  సమస్యలు మరింత తీవ్రమవుతున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉండే అధికారులకు సమాచారం చేరడం, వారి స్పందించి తీరిక సమయంలో గ్రామానికి చేరుకొని మోటార్లను బాగుచేయించే నాటికి వారం, పది రోజులు పడుతోంది.  

 బారులుతీరుతున్న జనం..
 వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లు అడుగంటే స్థితికి చేరుకున్నాయి. గతంలో పదుల సంఖ్యలో ఉండి, కాలనీలన్నింటికీ నీరందించే చేతిప ంపులు ప్రస్తుతం దిష్టిబొమ్మల్లా మారాయి. మరికొన్ని గ్రామాల్లో వచ్చే కొద్దిపాటి కోసం గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. తాగేందుకే నీరు సరిపడా ఉండటంలేదని, దీనికి తోడు కుంటలు, చెరువులు ఎప్పుడో ఎండిపోవడంతో మేకలు, పశువులకు తాగునీరులేక అల్లాడుతున్నాయని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేళాపాలా లేకుండా విద్యుత్ అధికారులు కోతలు విధిస్తుండటంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది.

మరిన్ని వార్తలు