చదువే లోకం.. ర్యాంకుల రాగం | Sakshi
Sakshi News home page

చదువే లోకం.. ర్యాంకుల రాగం

Published Tue, May 6 2014 3:58 AM

చదువే లోకం.. ర్యాంకుల రాగం - Sakshi

ప్రైవేటుకు దీటుగా ‘ప్రభుత్వ’ విద్యార్థులు
 చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు మల్దకల్ సర్కారు కళాశాల విద్యార్థులు. అరకొర సౌకర్యాలున్నా సర్దుకొని కష్టపడ్డారు. అధ్యాపకుల సూచనలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చదివి ఇంటర్‌లో జిల్లాలో 97.4 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు కళాశాలలకు సవాల్‌గా నిలిచారు. సర్కారు చదువులంటే చులకనగా చూసే వారికి సరైన విధంగా సమాధానం చెప్పారు.         - న్యూస్‌లైన్, మల్దకల్
 
 మల్దకల్ సర్కారు కళాశాలలో చది వే విద్యార్థులందరు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. కూలి పనులు చేస్తేగాని వారి పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం నుంచి అందే స్కారల్‌షిప్‌లపై ఆధారపడి, అరకొర వసతుల నడుమ విద్యాభ్యాసం చేశారు. అధ్యాపకులు బోధిం చిన పాఠాలు, చెప్పిన విధానాన్ని ప్రణాళి కా బద్ధంగా చదివారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రథమంలో 87.9 శాతం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 97.4 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే ఈ కళాశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు.

 ప్రిన్సిపాల్ రంగస్వామి, అధ్యాపకులు విద్యార్థుల నాడి పట్టుకొని వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రతి ఆదివారం సబ్జక్టుల వారీగా అధ్యాపకులు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించారు. వారి సూచనలు పాటించి విద్యార్థులు కష్టపడి చదివి కార్పొరేట్, హైటెక్నాలజీ, అన్ని హంగులు, సౌకర్యాలతో కూడిన ప్రైవేట్ కళాశాల విద్యార్థులు సాధించలేని ర్యాంకులు వీరు సాధించి నిరూపించారు. ఈ సరస్వతీ బిడ్డలను ‘న్యూస్‌లైన్’ పలకరించి వారి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుంది.
 
 మా అమ్మ కష్టాలు తీరుద్దామని..

 మాది పేద కుటుంబం. కష్టపడితే నే కడుపునిండేది. నాన్న అంపయ్య నా చిన్న వయసులోనే చనిపోయా డు. అమ్మ దర్శమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు కూలిపనులు చేసి నన్ను చ దివించింది. ఎంపీసీలో 871 మార్కులు సా ధించాను. మా మ్యాథ్స్ లెక్చరర్ శ్రీనివాసులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినడంతో ఆ సబ్జెక్ట్‌లో 75 మార్కులకు 75 మార్కులు వచ్చాయి. ఇంజనీయర్ అయ్యి మా అమ్మ క ష్టాలు తీరుస్తా.
 - కాశిమన్న,
 పెంచికలపాడు గ్రామం, గట్టు  మండలం

 
 సారోళ్ల ప్రోత్సాహంతోనే..
 అమ్మానాన్న సుగుణ, వెంకట్రాములు కూలికి పోయి నన్ను చదివించారు. తల్లిదండ్రుల్లా నేను కష్టపడకూడదని మా సారోళ్లు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విన్నా. నా కష్టానికి బైపీసీలో 872 మార్కులు వచ్చాయి. కెమిస్ట్రీలో 60 మార్కులకు 58 మార్కులు సాధించాను. కెమిస్ట్రీ లెక్చరర్ రామాంజనేయులుగౌడు ప్రోత్సాహంతోనే నాకు అన్ని మార్కులు వచ్చాయి. ఇలాగే చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని అవుతా.    
 - సుప్రియ,
 ఎల్కూరు గ్రామం, మల్దకల్ మండలం

 
 నేనూ లెక్చరర్‌నవుతా..

 తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయను. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సీఈసీలో 839 మార్కులు సాధించాను. రోజు అమ్మానాన్న చెప్పిన మాటలు భవిష్యత్తును గుర్తుచేసేవి. మా సారోళ్లు చెప్పినట్లు  చదివాను. కామర్స్ లెక్చరర్ నర్సింహులు మా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అందుకే కామర్స్‌లో వందకు 97 మార్కులు సాధించాను. భవిష్యత్తులో నేనూ లెక్చరర్‌ను అవుతా.
                 - తిమ్ములమ్మ, మల్దకల్

Advertisement
Advertisement