‘కేసులు దాచిపెట్టాల్సిన అవసరం లేదు’

16 Apr, 2020 19:53 IST|Sakshi

సాక్షి, విశాఖ : రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా నియంత్రణలో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావడం అభినందనీయమని  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పారిశ్రామికవేత్తల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో కరోనా నియంత్రణ కోసం కష్టపడుతున్న పోలీస్ శాఖ, రెవెన్యూ, మున్సిపల్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. విశాఖలో కరోనాని కట్టడి చేయడంలో కలెక్టర్‌తోపాటు పోలీస్ కమీషనర్, ప్రజల కృషి మరువలేనిదన్నారు.

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు దాచిపెట్టారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసులు దాచిపెట్టాల్సిన తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 20 పాజిటివ్ కేసుల్లో పది మంది కోలుకుని ఇళ్లకి వెళ్లిపోయారని, మిగిలిన వారంతా కోలుకుంటున్నారని తెలిపారు. మరో వారం రోజుల్లో కరోనా ఫ్రీ జోన్‌గా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో విశాఖ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు