టీడీపీ నేతల బండారం బట్టబయలు

11 Sep, 2019 12:22 IST|Sakshi

ఐదేళ్ల అరాచకాలను వెల్లడించిన టీడీపీ బాధితులు

అక్రమ కేసులు పెట్టించిన ప్రత్తిపాటి పుల్లరావు

పార్టీ మారకపోతే థర్డ్‌ డిగ్రీ ప్రయోగమే

ఆవేదన వ్యక్తం చేసిన పల్నాడు స్థానికులు

సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అక్కడి స్థానికులు బట్టబయలు చేశారు. టీడీపీ హయాంలోనే తమపై అనేక దాడులు జరిగాయని, పార్టీ మారనందుకు తమపై అనేక అక్రమల కేసులను పెట్టారని టీడీపీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బుధవారం ఛలో ఆత్మకూరుకు టీడీపీ నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పల్నాడులో ప్రశాంతంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే దీనిపై అక్కడి స్థానికులు నమ్మలేని నిజాలను వెల్లడించారు.

ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో చిత్రహింసలకు గురైన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు అధికారంలో ఉన్నంత కాలం మమ్మల్ని తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆయన చెప్పినట్టు వినకపోతే పోలీసులతో వార్నింగ్‌ ఇ‍ప్పించేవారు. కేసులు పెట్టించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించేవారు. టీడీపీ నేతల అరాచకాలు మాటల్లో చెప్పలేనివి. 2013లో టీడీపీ అభ్యర్థిపై పోటీచేసి సర్పంచ్‌గా గెలిచాను. దీంతో నాపై కక్షకట్టి వివిధ కేసుల్లో ఇరికించి. రూ. రెండుకోట్లు వసూలు చేశారు. పంచాయతీకి కనీసం నిధులు కూడా  ఇవ్వలేదు. ఐదేళ్ల తరువాత ఎన్నికల ముందు నిధులు ఇస్తాం. టీడీపీలో చేరండి అంటూ ఒత్తిడి తెచ్చారు. వందకోట్లు ఇచ్చినా పార్టీ మారనని చెప్పా’ అని ఓ బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

చదవండిల్నాడులో టీడీపీ నీచ రాజకీయాలు!

టీడీపీ అరాచకాలపై మరో వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను తొలి నుంచి వైఎస్సార్‌సీపీలోనే ఉన్నా. పార్టీ మారనని తెలిసి అనేక కేసుల్లో ఇరికించారు. పుల్లారావు మంత్రి అయిన తరువాత వేధింపులు మరింత ఎక్కువైయ్యాయి. టీడీపీలో చేరనందుకు నా షాపుని అర్థరాత్రి అక్రమంగా కూల్చివేశారు’ అని తెలిపారు.  ఐదేళ్ల టీడీపీ పాలనలో సిగ్గుమాలిన పనులు చేసినందుకు గత ఎన్నికల్లో ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారని ఓ బాధితుడు అభిప్రాయపడ్డాడు. తాను తొలుత టీడీపీలోనే ఉన్నానని, తరువాత వైఎస్సార్‌సీపీ చేరినట్లు తెలిపారు. టీడీపీలో ఉన్నంతకాలం తనపై ఎలాంటి కేసులు లేవని.. వైఎస్సార్‌సీపీలో చేరినందుకు అనేక కేసులతో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడేదిలేదని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు