‘సమైక్యాంధ్రాను పరిరక్షించుకుందాం’

5 Aug, 2013 21:43 IST|Sakshi

కాకినాడ: సమైక్యాంధ్రాను సాధించుకోవడం కాదు.. పరి రక్షించుకుందామని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో అంధ్రప్రదేశ్ ముందడుగులో ఉందని, విభజన జరిగితే ఆంధ్రా ప్రాంతం నీటి కరువుతో అల్లాడుతుందన్నారు. రాజకీయ దురుద్దేశంతో విభజన చేయడం దారుణమని నెహ్రూ విమర్శించారు.  సోమవారం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు
 
. హైలెవల్ కమిటీలో అన్ని పార్టీల నేతలను పిలవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శాస్త్రీయంగా అన్ని అంశాలపై చర్చలు జరగాలని పేర్కొన్నారు.  రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ విభజన కార్యక్రమం చేపట్టిందన్నారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వకుండా,  సీఎం, పీసీసీ చీఫ్‌లకు ఇవ్వడంలో అర్థమేమిటని  సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.  విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుది రెండు నాల్కల ధోరణి అని ఆయన విమర్శించారు.
 

మరిన్ని వార్తలు