దిగ్విజయ్ని కలిసిన కేంద్ర మంత్రులు | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ని కలిసిన కేంద్ర మంత్రులు

Published Mon, Aug 5 2013 9:31 PM

దిగ్విజయ్ని కలిసిన కేంద్ర మంత్రులు - Sakshi

ఢిల్లీ: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. తమ వాదన వినిపించారు. సమైక్యాంధ్ర తీర్మానాన్ని వారు దిగ్విజయ్ సింగ్కు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి, జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్కు తమ వాదన వినిపించినట్లు తెలిపారు. ఎవరికి అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్పై తాము లేవనెత్తి అంశాలను లిఖితపూర్వకంగా తెలియజేయమని ఆయన కోరినట్లు చెప్పారు. హైలెవల్ కమిటీ ముందు త్వరలోనే తమ వాదనలను వినిపిస్తామన్నారు. సమావేశాలకు అడ్డుపడకుండా సీమాంధ్ర ఎంపిలను ఒప్పిస్తామని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ను కలిసినవారిలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, పురందేశ్వరీ, కిల్లి కృపారాణి ఉన్నారు.

సమైక్యాంధ్రకే తమ మొదటి మద్దతని  కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. అలా కాకపోతే మూడు రాష్ట్రాలు  ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల అపాయింట్లు కోరినట్లు చెప్పారు. కమిటీ ముందు వాదనలు వినిపించమని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు  కోట్ల తెలిపారు.

ఎటువంటి పరిస్థితులలో తాము హైదరాబాద్  వదలుకోం అని,  హైదరాబాద్తో కలిసే ఉంటామని  ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి చెప్పారు. శ్రీశైలం జలాశయానికి నీరు ఎలా వస్తాయనేది తమ ప్రధాన సమస్య అన్నారు. పైనుంచి నీరు రాకుంటే తమ ప్రాంతం ఎడారి అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా,  సీమాంధ్ర ఎంపీలు రేపు ప్రధాని మన్మోహన్ సింగ్ను కలుస్తారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరతారు.

Advertisement
Advertisement