సభను స్తంభింపచేసిన వైఎస్ఆర్ సీపీ

24 Mar, 2015 09:52 IST|Sakshi
సభను స్తంభింపచేసిన వైఎస్ఆర్ సీపీ

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై దద్దరిల్లింది. ఛార్జీల పెంపుపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు పాటు వాయిదా వేశారు. కాగా ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.  

ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాతే చర్చకు అవకాశం ఉంటుందని స్పీకర్ తెలిపారు. దీనిపై మంత్రి జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత మాట్లాడదామని చెప్పగా, అయితే ముఖ్యమైన అంశమైనందున తక్షణమే చర్చను చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ పట్టు వీడలేదు.  పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని విపక్షం నినాదాలు చేయటంతో సభ హోరెత్తింది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు