దేశీయ ఐటీకి మంచి రోజులు వస్తున్నాయ్‌!

23 Oct, 2017 18:16 IST|Sakshi

హైదరాబాద్‌ : అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. మన దేశీయ ఐటీకి మంచి రోజులు వస్తున్నాయట. ఈ విషయాలను సీనియర్‌ ఇండస్ట్రీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశీయ ఐటీకి 2018 మంచి ఏడాది కాబోతుందని, టెక్‌ వ్యయాల వృద్ధికి, క్లయింట్ల నుంచి డిమాండ్‌కు 2018 మెరుగ్గా ఉంటుందని ఇండస్ట్రీ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా దేశీయ ఐటీకి అతిపెద్ద మార్కెట్‌ మాత్రమే కాదని, వృద్ది అవకాశాలు సంపాదించడానికి ఇది చాలా క్లిష్టమైనదని కూడా మాజీ ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ వీ బాలక్రిష్ణన్‌ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందని, 2-2.25 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ గార్టనర్‌ రిపోర్టు తీసుకుంటే ఈ ఏడాది మొత్తం ఐటీ వ్యయాలు 4 శాతం నుంచి 4.5 శాతం పెరిగే అవకాశముందని, అంటే అక్కడ వృద్ధి ఉందని బాలక్రిష్ణన్‌ తెలిపారు.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బాగుందని, ఇది దేశీయ ఐటీ కంపెనీలకు ఒక ఆశలాంటిదని పేర్కొన్నారు. 2017-18లో దేశీయ ఐటీ ఎగుమతులు 7-8 శాతం వృద్దిని నమోదుచేస్తాయని నాస్కామ్‌ కూడా అంచనావేస్తోందని, దేశీయ మార్కెట్‌ 10-11 శాతం వృద్ధి ఉంటుందని, అంటే మొత్తంగా ఈ ఏడాది బాగుంటుందని బాలక్రిష్ణన్‌ చెప్పారు. అన్ని పెద్ద కంపెనీల్లో డిజిటల్‌ వర్క్‌ రెండెంకల వృద్దిని నమోదుచేస్తుందని, సంప్రదాయ వ్యాపారాల్లో అంత వృద్ధి ఉండదని ఇన్ఫోసిస్‌ మరో మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌ దాస్‌ పాయ్‌ కూడా తెలిపారు. వ్యాపారాల్లో డిజిటల్‌ 20-25 శాతం వృద్ధి చూడొచ్చన్నారు.

మరిన్ని వార్తలు