ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ : 2700% ఎక్కువ డేటా

25 Jan, 2018 19:54 IST|Sakshi

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియోకి, ఎయిర్‌టెల్‌కు మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. జియో ప్లాన్లను సమీక్షించిన వెంటనే.. దానికి పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా తన ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేస్తూ వెళ్తోంది. తాజాగా ఎయిర్‌టెల్‌ తన 149 రూపాయల ప్లాన్‌ను రెండోసారి అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం వారంలోనే రెండోసారి.  ఎయిర్‌టెల్‌ అంతకముందు ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ డేటాను ఎయిర్‌టెల్‌ అందించింది. ప్రస్తుతం ఈ డేటా పరిమితిని మరింత పెంచింది. రోజుకే 1జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ముందస్తు ప్రయోజనాలతో పాటు రోజుకు 1జీబీ డేటా వినియోగదారులు పొందనున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్లాన్‌ రిలయన్స్‌ జియో రూ.149 ప్లాన్‌కు డైరెక్ట్‌ పోటీగా ఉంది. 

జియో కూడా ఈ ప్లాన్‌పై రోజుకు 1జీబీ డేటా ఆఫర్‌ చేస్తోంది. రోజుకు 1జీబీ డేటాతో పాటు రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌ను అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌ రెండు అందిస్తున్న రూ.149 ప్లాన్ల వాలిడిటీ 28 రోజులు. ఢిల్లీ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎయిర్‌టెల్‌ కస్టమర్లందరికీ రూ.149 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ వారం ప్రారంభంలో ఎయిర్‌టెల్‌ తన రూ.199 ప్లాన్‌ను, రూ.448 ప్లాన్‌ను, రూ.509 ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మూడు ప్లాన్లపై రోజువారీ డేటా పరిమితి 1.4జీబీ డేటా. అంతకముందు ఈ ప్యాక్‌లపై 1జీబీ డేటానే ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేసేది.  

మరిన్ని వార్తలు