స్థూల ఆదాయంలో ఎయిర్‌టెల్‌ టాప్‌

3 Dec, 2019 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో టెలికం కంపెనీల స్థూల ఆదాయం రూ. 54,218 కోట్లుగా ఉంది. టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. భారతీ ఎయిర్‌టెల్‌ ఆదాయం రూ. 19,061 కోట్లుగా నమోదైంది. అంటే, మొత్తం ఈ రంగం సాధించిన స్థూల ఆదాయంలో సంస్థ వాటా 35 శాతంగా ఉంది.  ప్రభుత్వానికి రూ. 1,160.63 కోట్లు (లైసెన్స్‌ ఫీజు రూ. 851.3 కోట్లు, స్పెక్ట్రం ఫీజు రూ. 309.33 కోట్లు)ను చెల్లించింది. అయితే, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)లో మాత్రం వెనకపడిపోయింది. ఇది 55.83 శాతంతో రూ. 10,641.33 కోట్లకు పరిమితమైంది.

మరిన్ని వార్తలు