అందరమూ దానికోసమే వెదుకుతున్నాం..!

26 Jun, 2019 16:36 IST|Sakshi

2019 బడ్జెట్‌ అంచనాలపై ఆనంద్‌ మహీంద్ర స్పందన

ఆటోపరిశ్రమపై జీఎస్‌టీ తగ్గించాలి - ఆనంద్‌ మహీంద్ర  

అలా అయితే ఆర్థిక వ్యవ్యస్థపై బహుళ విధాలుగా గణనీయ ప్రభావం

ఆటోపరిశ్రమపై జీఎస్‌టీ 28 నుంచి 18 తగ్గించాలని డిమాండ్‌

సాక్షి,  ముంబై : 2019 కేంద్ర బడ్జెట్‌లో ఆటో పరిశ్రమ ఆశలు, అంచనాలపై పారిశ్రామికవేత్త  మహింద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా ఆనంద్‌ మహీంద్ర  స్పందించారు. ఆటో మొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని కోరుకున్నారు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని అన్నారు.  ఆటో పరిశ్రమ రంగం  చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై  పెను ప్రభావం చూపుతుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. 

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే (అమృతాన్నిపంచే) మందర పర్వతం(క్షీరసాగర మథనంలోని పర్వతం) వైపు అందరం చూస్తున్నాం. తానూ పక్షపాతంగానే ఆలోచిస్తున్నప్పటికీ.. జీఎస్‌టీ తగ్గిస్తే.. ఉద్యోగాల కల్పన, చిన్న పరిశ్రమల వృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని  చూపుతుందని  ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు.

ముఖ్యంగా ఆటోకార్‌ ప్రొఫెషనల్‌ అనే ఆటోమోటివ్‌​ మ్యాగజీన్‌ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. దేశంలో భారీగా(మూడో వంతు) ఉద్యోగాలు సృష్టించే ఆటోమొబైల్‌ రంగం మళ్లీ వృద్ధి దిశగా పయనించాలంటే వాహనాలపై జీఎస్‌టీ తగ్గించాల్సిన అవసరం ఉందన్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌ డీలర్స్ అసోసియేషన్‌  మాజీ అధ్యక్షుడు జాన్‌ కే పాల్‌ వ్యాఖ్యలను మ్యాగజైన్‌ ట్వీట్‌ చేసింది. అటు పరిశ్రమ బాడీ సియామ్‌ కూడా వాహనాలపై జీఎస్‌టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించాలని  డిమాండ్‌  చేస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా 18 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా  ఆటోమొబైల్‌ విక్రయాలు భారీగా పతనమయ్యాయి.  మే నెలలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 20 శాతానికి పైగా క్షీణించాయి.  అంతక్రితం 2001 సెప్టెంబరులో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 21.91శాతం పడిపోయాయి.

మరిన్ని వార్తలు