మూడు రోజుల నష్టాలకు బ్రేక్

5 Feb, 2016 02:26 IST|Sakshi
మూడు రోజుల నష్టాలకు బ్రేక్

షార్ట్ కవరింగ్‌తో లాభాలు
115 పాయింట్ల లాభంతో 24,338కు సెన్సెక్స్
42 పాయింట్ల లాభంతో 7,404కు నిఫ్టీ

ముడి చమురు ధరలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి. దీనికి షార్ట్ కవరింగ్ కూడా తోడవడంతో మన స్టాక్ మార్కెట్  గురువారం లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 7,400 కీలక పాయింట్లను దాటింది.  ఇటీవల పతనం కారణంగా బాగా తగ్గి నష్టపోయిన షేర్లలో కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 24,338 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 7,404 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన జీఎస్‌టీ, దివాళా బిల్లులు ఆమోదం పొందగలవని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేయడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది. రూపాయి 52 పైసలు బలపడడం సానుకూల ప్రభావం చూపింది.

 ఫార్మా షేర్లు కుదేల్
అన్ని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్(ఏపీఐ)లను అమెరికాలోనే తయారు చేయడం తప్పనిసరని అమెరికా పేర్కొనడంతో ఫార్మా షేర్లు కుదేలయ్యాయి. ముడి చమురు ధరలు పెగరడంతో విమానయాన షేర్లు నష్టపోయాయి. ఉక్కు ఉత్పాదకతను తగ్గించాలన్న చైనా నిర్ణయంతో ఉక్కు కంపెనీల షేర్లు పెరిగాయి.

టీమ్ లీజ్ ఐపీఓకు మంచి స్పందన
రిక్రూటింగ్ సేవలందించే టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. గురువారం ముగిసిన ఈ రూ.423 కోట్ల  ఐపీఓ 66 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.

మరిన్ని వార్తలు