ఆసుస్‌ ఫోన్లకు జియో ఫుట్‌బాల్‌ ఆఫర్‌

23 Feb, 2018 15:31 IST|Sakshi
ఆసుస్‌ ఫోన్లపై జియో ఫుట్‌బాల్‌ ఆఫర్‌

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో, మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి ఆసుస్‌ జతకట్టాయి. ఈ భాగస్వామ్యంలో కొత్త ఆసుస్‌ జెన్‌ఫోన్‌ ఫోన్లపై జియో తన ఫుట్‌బాల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద జెన్‌ఫోన్‌ మోడల్స్‌పై రూ.2,200 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. జెన్‌ఫోన్‌ మోడల్స్‌ కొనుగోలు చేసిన కస్టమర్లు, జియోసిమ్‌ను తమ డివైజ్‌లో  వేసుకుని యాక్టివేట్‌ చేసుకుంటే, కొత్త జియో ఫుట్‌బాల్‌ ఆఫర్‌కు యూజర్లు అర్హులవుతారు.
 
జియో ఫుట్‌బాల్‌ ఆఫర్‌ కింద ఎంపికచేసిన జెన్‌ఫోన్‌ మోడల్స్‌లో... ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 2 లేజర్‌ 5.5, జెన్‌ఫోన్‌ 3 5.2, జెన్‌ఫోన్‌ 3 5.5, జెన్‌ఫోన్‌ 3 లేజర్‌, జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌ 5.2, జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌5.5, జెన్‌ఫోన్‌ 3ఎస్‌ మ్యాక్స్‌, జెన్‌ఫోన్‌ 4 సెల్ఫీ లైట్‌, జెన్‌ఫోన్‌ 4 సెల్ఫీ ప్రొ, జెన్‌ఫోన్‌ ఏఆర్‌, జెన్‌ఫోన్‌ డీలక్స్‌, జెన్‌ఫోన్‌ గో 4.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్‌ గో 5.0 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్‌ గో 5.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్‌ లైవ్‌, జెన్‌ఫోన్‌ లైవ్‌(డబ్ల్యూడబ్ల్యూ), జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌, జెన్‌ఫోన్‌ సెల్ఫీ, జెన్‌ఫోన్‌ ఆల్ట్రా, జెన్‌ఫోన్‌ జూమ్‌ ఎస్‌లు ఉన్నాయి. ఈ ఫోన్లపై జియో తన ఫుట్‌బాల్‌ ఆఫర్‌ను అందిస్తోంది. 

ఈ ఆఫర్‌ కొత్త, పాత జియో యూజర్లందరికీ అందుబాటులో ఉండనుంది. ఒకవేళ ఇప్పటికే జియో యూజర్‌ అయి ఉంటే, కొత్త జియోఫోన్‌లో ఆ పాత సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. జియో అందిస్తున్న రూ.2,200 క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు ఓచర్ల రూపంలో పొందనున్నారు. మైజియో యాప్‌లో ఇవి క్రెడిట్‌ అవుతాయి. తర్వాత వీటిని రీఛార్జ్‌ చేసుకునే సమయంలో రిడీమ్‌ చేసుకోవచ్చు.  అయితే జియో ఫుట్‌బాల్‌ ఆఫర్‌ పొందాలంటే యూజర్లు రూ.198 లేదా రూ.299 ప్లాన్‌తో తప్పనిసరిగా రీఛార్జ్‌ చేయించుకోవాలి. ఈ క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను 2022 మే 31 వరకు వాడుకోవచ్చు.   
 

మరిన్ని వార్తలు