యాక్సిస్ బ్యాంక్ లాభం 18 శాతం అప్

23 Jul, 2014 01:47 IST|Sakshi
యాక్సిస్ బ్యాంక్ లాభం 18 శాతం అప్

 ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 1,667 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,409 కోట్లతో పోలిస్తే ఇది 18%పైగా వృద్ధి. ఇందుకు కేటాయింపులు(ప్రొవిజన్లు) సగానికి తగ్గడం దోహదపడినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రొవిజన్లు రూ. 712 కోట్ల నుంచి రూ. 387 కోట్లకు తగ్గాయి. ఇదే కాలానికి బ్యాంక్ ఆదాయం రూ. 9,059 కోట్ల నుంచి రూ. 9,980 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.86% నుంచి 3.88%కు పుంజుకున్నాయి.

 వడ్డీ ఆదాయం 16% వృద్ధి: యాక్సిస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16% ఎగసి రూ. 3,310 కోట్లను తాకింది. గతంలో రూ. 2,865 కోట్ల వడ్డీ ఆదాయం నమోదైంది. అయితే వడ్డీయేతర(ఇతర) ఆదాయం మాత్రం రూ. 1,781 కోట్ల నుంచి రూ. 1,691 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.1% నుంచి 1.34%కు పెరిగాయి. నికర ఎన్‌పీఏలు కూడా 0.35% నుంచి 0.44%కు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 0.3% క్షీణించి రూ. 2,018 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు