భారీగా పడిపోయిన భారతీ ఎయిర్‌టెల్‌

26 Jul, 2018 19:48 IST|Sakshi
భారతీ ఎయిర్‌టెల్‌ ఫైల్‌ ఫోటో

ముంబై : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ క్వార్టర్‌ ఫలితాల్లో భారీగా పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్‌ క్వార్టర్‌ ఫలితాల్లో భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలు 74 శాతం క్షీణించి రూ.97.30 కోట్లగా రికార్డయ్యాయి. ఈ టెలికాం దిగ్గజం గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.367.30 కోట్ల లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ క్వార్టర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.479 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలిసింది. కానీ నికర నష్టాల బాధ నుంచి ఎయిర్‌టెల్‌ తప్పించుకుంది. కానీ కంపెనీ లాభాలు మాత్రం భారీగానే దెబ్బకొట్టి, బాగా క్షీణించాయి. 

ఈ క్వార్టర్‌లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ రెవెన్యూలు రూ.20,080 కోట్లకు పడిపోయాయని ప్రకటించింది. ఇవి గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.21,958.10 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. కానీ  2019 ఆర్థిక సంవత్సరం క్యూ1లో స్టాండలోన్‌ బేసిస్‌లో కంపెనీ రూ.1,457.20 కోట్ల నికర నష్టాలను నమోదు చేసిందని తన ఫలితాల ప్రకటనలో పేర్కొంది. కన్సాలిడేటెడ్‌ మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ ఈ క్వార్టర్‌లో 2,236 బిలియన్‌ ఎంబీగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. ఏడాది ఏడాదికి ఇది 328 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది. ఆపరేషనల్‌ వైపు, ఈబీఐటీడీఏ లు సీక్వెన్షియల్‌గా 3 శాతం తగ్గి రూ.6,837 కోట్లగా ఉన్నాయి. దేశీయ వైర్‌లెస్‌ వ్యాపారాలు ఈ క్వార్టర్‌లో సీక్వెన్షియల్‌గా 1 శాతం పెరిగి రూ.10,480 కోట్లగా రికార్డయ్యాయి. ఒక్కో యూజర్‌ సగటు రెవెన్యూ జూన్‌ క్వార్టర్‌లో రూ.105గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. గత క్వార్టర్‌లో ఇది రూ.116గా ఉంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 1.63 శాతం పెరిగి రూ.357.60గా నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు