మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

23 Aug, 2019 08:46 IST|Sakshi

హైదరాబాద్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ముందుకు వచ్చింది. సంస్థ 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందించాలని తన ఉద్యోగులకు పిలుపునిచ్చింది. కడుపునిండా ఆహారం ఉంటే విద్యార్థులు మరింత మంచిగా చదువుకోగలరని తాము నమ్ముతున్నట్టు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో వికాస్‌సేత్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 15,000 పాఠశాల్లలో ప్రతీ రోజూ  17.6 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌ అందిస్తోంది. భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో 2025 నాటికి 50 లక్షల  మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్న తమ లక్ష్యం దిశగా మరికొన్ని అడుగులు వేసేందుకు వీలవుతుందని అక్షయ పాత్ర ఫౌండేషన్‌ సీఈవో శ్రీధర్‌ వెంకట్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు