మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

21 Aug, 2019 09:05 IST|Sakshi

74 పాయింట్లు పతనమై 37,328కు సెన్సెక్స్‌

11,017కు ఎన్‌ఎస్‌ఈ 50

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిచ్చే ప్రభుత్వ చర్యల ఎదురుచూపుల నేపథ్యంలో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. వాహన, ఐటీ షేర్లు లాభపడగా, బ్యాంక్, ఆర్థిక, ఇంధన, లోహ రియల్టీ షేర్లు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 74 పాయింట్ల నష్టంతో 37,328 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్లు తగ్గి 11,017 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు తగ్గి 71.69కు చేరడం, ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం  ప్రతికూల ప్రభావం చూపిం చాయి. అంతకు ముందటి మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 444 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల మేర పెరిగాయి.  ఆసియా మార్కెట్ల జోష్‌తో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత ఒడిదుడుకులకు గురై, లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాల జోరు పెరగడంతో నష్టాల్లో  ముగిసింది. ఒక దశలో 109 పాయింట్లు పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో దశలో 183 పాయింట్లు నష్టపోయింది. రోజంతా   చూస్తే, 292 పాయింట్ల రేంజ్‌లో      కదలాడింది.

మరిన్ని వార్తలు