ఒక్కొక్కరికి రూ.14లక్షల క్రిస్మస్‌ బోనస్‌

24 Dec, 2018 20:08 IST|Sakshi

ఫ్లోరాక్రాఫ్ట్‌ క్రిస‍్మస్‌ బోనస్‌ బొనాంజా

ఉద్యో​గులే కంపెనీకి సర్వస్వం-ఫ్లోరాక్రాఫ్ట్‌

ఒక్కొక్కరికి 14లక్షలు చొప్పున 200మందికి ఆఫర్‌

40 సంవత్సరాల సర్వీసుంటే రూ. 62లక్షలు

ఇండియాలో దీపావళికి సూరత్‌ డైమండ్‌ వ్యాపారులు ఖరీదైన ఇళ్లు, కార్లు బహుమతులుగా ఇవ్వడం మనం చూశాం. తాజాగా ఈ కోవలోకి అమెరికాకు చెందిన కంపెనీ బాస్‌ కూడా చేరిపోయారు. క్రిస్మస్‌ సందర్భంగా తన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఒక్కొక్కరికీ రూ.14 లక్షల రూపాయల క్రిస్మస్‌ బోనస్‌ అందిస్తున్నారట. ​కోట్ల రూపాయల క్రిస్మస్‌ బోనస్‌ను యజమాని ప్రకటించగానే కొంతమంది ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట.

మిచిగాన్‌కు చెందిన ఫ్లోరాక్రాఫ్ట్‌ కంపెనీ అధిపతి లియో స్కోనర్ర్ (82)సంస్థలోని దాదాపు 200మంది ఉద్యోగులకు శాంతా వెలుగులు నింపేశారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చేసిన కృషికి, శ్రమకు గుర్తింపుగా ఈ బోనస్‌ ఇస్తున్నట్టు లియో ప్రకటించారు. అంతేకాదు ఉద్యోగులే కంపెనీకి సర్వస్వం అని సగర్వంగా ప్రకటించారు.  సంస్థలో పనిచేసిన పీరియడ్‌ అధారంగా  ఈ బోనస్‌ విలువ పెరుగుతుంది. 40 సంవత్సరాల పాటు సంస్థలో పనిచేసిన వారికి 60వేల డాలర్లు (రూ.42లక్షలు) ఈ బహుతి అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ బోనస్‌ మొత్తంలో 75శాతం ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ ప్లాన్‌లోజమచేసి, మిగిలిన సొమ్మును నగదు రూపంలో ఉద్యోగులకు అందించనున్నారు.

1946లో లుడింగ్టన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఫ్లోరాక్రాఫ్ట్‌ వాల్‌మార్ట్‌, అమెజాన్, మైఖేల్స్, జోన్, హాబీలాబీ లాంటి రిటైలర్లకు ఫోమ్‌ ఉత్పత్తులను విక్రయిస్తుంది.

మరిన్ని వార్తలు