ప్రపంచ వృద్ధికి భారత్ బాట

11 Jun, 2016 01:06 IST|Sakshi

ముంబై: ప్రపంచ ఆర్థిక చోదకశక్తిగా వ్యవహరించే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని హెచ్‌ఎస్‌బీసీ ఒక నివేదికలో పేర్కొంది. 2025 నాటికి ఈ దిశలో కీలక స్థానానికి చేరుతుందని విశ్లేషించింది. నివేదిక ప్రకారం.. ప్రపంచం మొత్తం మందగమనంలో ఉన్నా భారత్ ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి చోదకశక్తిగా ఆవిర్భవించే అవకాశాలు భారత్‌కు ఏర్పడ్డాయి. 2029 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక వాటాను సంపాదించుకుంటుంది.7% వృద్ధి నమోదైతే.. దేశం 2029 నాటికి ‘చైనా 2005 నాటి’ ప్రపంచ కీలక స్థాయిని చేరుతుంది. ఇంకా ఎక్కువ వృద్ధి నమోదయితే 2023కే ఈ ఫలితాన్ని అందుకునే వీలుంది.

మరిన్ని వార్తలు